YCP Leader: టీడీపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. వైసీపీ నేతపై కేసు నమోదు
ABN, Publish Date - May 22 , 2025 | 09:05 AM
YCP Leader: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే, టీడీపీ నేత భూమా అఖిల ప్రియపై వైసీపీ ఆరోపణల నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డిపై ఆళ్లగడ్డలో కేసు నమోదు అయింది.
నంద్యాల, మే 22: వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డిపై ఆళ్లగడ్డలో కేసు నమోదు అయింది. ఎర్రగుంట్లకు చెందిన నాగ ప్రసాద్ ఫిర్యాదు నేపథ్యంలో భూమా కిషోర్ రెడ్డిపై ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ కేసు నమోదు చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మాంసం దుకాణాల నుంచి కేజీ చికెన్‌పై రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలపై ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ఖండించారు. అంతేకాదు మీడియా ముందుకు వచ్చి ఆమె వివరణ సైతం ఇచ్చారు. కానీ వైసీపీ మాత్రం ఈ ఆరోపణలను కొనసాగిస్తుంది.
దీంతో టీడీపీ, వైసీపీ గ్రూప్‌ల మధ్య స్థానికంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలను తప్పుదోవ పట్టించడం ద్వారా ఉద్రిక్త పరిస్థితులకు వైసీపీ వర్గీయులు కారణమవుతున్నారంటూ నాగ ప్రసాద్.. పోలీసుకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే అతడి అనుచరులు అంబటి మహేశ్వర్ రెడ్డి ,శివ శంకర్ రెడ్డి, మల్లికార్జున్, రుద్ర శివ నాగిరెడ్డి, ప్రతాపరెడ్డి ,అంబటి చంద్రశేఖర్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇంకోవైపు భూమా అఖిల ప్రియ చికెన్ ధరల్లో కమిషన్ తీసుకొంటున్నారంటూ వైసీపీ నేతల ఆరోపణలు గుప్పించారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో చివరి వారంలో కర్నూలులోని ఆ పార్టీకి చెందిన మీడియా కార్యాలయం ఎదుట ఆమె కోళ్లతో వినూత్న నిరసన తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా పూర్తి అవాస్తవాలు రాసి.. తన ప్రతిష్ఠను దెబ్బతీసున్నారంటూ ఆమె మండిపడారు. గత ప్రభుత్వ హయాంలో.. ఆ పార్టీ నేతలకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే.. మీడియా కార్యాలయాలకు వచ్చి ధ్వంసం చేసే వాళ్లని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కేజీ చికెన్ ధర ఎంత.. ప్రస్తుతం ఎంత ధర ఉందో ఈ సందర్భంగా ఆమె సోదాహరణగా వివరించారు. తనపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారంటూ వైసీపీపై ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మండిపడిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
Optical Illusion Test: మీవి డేగ కళ్లు అయితేనే.. ఈ గదిలో పెన్సిల్‌ను 5 సెకెన్లలో కనిపెట్టగలరు
Milk: ఇలాంటి వారికి పాలు డేంజర్.. ఎట్టి పరిస్ధితిలోనూ తాగకూడదు..
Little girl Stotram: వావ్.. ఈ బాలిక స్ఫూర్తికి సలాం.. శివ తాండవ స్త్రోత్రం ఎలా చెబుతోందో చూడండి
For Andhrapradesh News and Telugu News
Updated Date - May 22 , 2025 | 09:24 AM