BC Janardan Reddy: కానిస్టేబుల్‌పై అనుచరుడు దాడి.. స్పందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
ABN, Publish Date - Jul 31 , 2025 | 04:40 PM
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని కలిమిగండ్లలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని ఇటీవల ప్రారంభించారు. ఆలయంలోకి వెళ్లేందుకు మంత్రి అనుచరుడు మదన్ భూపాల్ ప్రయత్నించాడు. అతడి ప్రయత్నాన్ని అక్కడి ఎమ్మెల్యే అడ్డుకున్నారు.
నంద్యాల, జులై 31: కొలిమిగుండ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్‌పై తన అనుచరుడు చేసిన దాడిని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ దాడి చేసిన వ్యక్తిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. అధికారులపై దురుసు ప్రవర్తన, దాడులను కూటమి ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించదని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
బుధవారం కర్నూలు జిల్లాలోని కొలిమిగుండ్లలో శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ప్రారంభోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో తనను వెంటనే ఆలయంలోకి పంపాలంటూ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అనుచరుడు మదన్ భూపాల్ రెడ్డి విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను కోరాడు.
భక్తుల రద్దీ తీవ్రంగా ఉండడంతో.. అతడిని ఆలయంలోకి అనుమతించేందుకు నిరాకరించాడు. దీంతో మదన్ భూపాల్ రెడ్డి రెచ్చిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్‌ను బూతులు తిడుతూ.. అతడిపై దాడి చేశాడు. ఆ వెంటనే ఏఆర్ కానిస్టేబుల్ జశ్వంత్ సైతం మదన్ భూపాల్ రెడ్డిపై దాడి చేశారు. ఇంతలో అక్కడే ఉన్న పోలీసులు జోక్యం చేసుకోవడంతో.. ఈ వివాదం కాస్తా సద్దుమణిగింది. అయితే అప్పటికే ఈ దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో మంత్రి బీసీ జానార్దన్ రెడ్డి స్పందించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగపూర్‌లో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన.. వరుస కీలక భేటీలు
మద్యం స్కామ్‌లో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై కోర్టు కీలక నిర్ణయం
For More AndhraPradesh News And Telugu News
Updated Date - Jul 31 , 2025 | 06:59 PM