AP Liquor Scam: మద్యం స్కామ్‌లో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై కోర్టు కీలక నిర్ణయం
ABN , Publish Date - Jul 31 , 2025 | 03:08 PM
ACB Court key decision, AP Liquor scam money, Latest News, ABN Andhrajyothi, Telugu News,
విజయవాడ, జులై 31: మద్యం కుంభకోణం కేసులో నగదు సీజ్ వ్యవహారంపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీజ్ చేసిన ఈ నగదు మొత్తాన్ని బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలని సిట్‌ను ఏసీబీ కోర్టు గురువారం ఆదేశించింది. విజయవాడ ఎస్‌బీఐ మాచవరం శాఖలో ఈ నగదునంతా డిపాజిట్ చేయాలని జారీ చేసిన ఆదేశాల్లో కోర్టు స్పష్టం చేసింది.
బుధవారం హైదరాబాద్ శంషాబాద్‌లోని కాచారంలో రూ. 11 కోట్ల నగదును సీజ్ చేసినట్లు కోర్టులో సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ కోర్టు ఆదేశాలతో మరికొద్దిసేపట్లో సిట్ కార్యాలయం నుంచి రూ. 11 కోట్ల నగదును తరలించి మాచవరం ఎస్‌బీఐ బ్రాంచ్‌లో సిట్ అధికారులు డిపాజిట్ చేయనున్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు విచారించారు. ఆ క్రమంలో వరుణ్‌ను విచారించారు. అతడు చెప్పిన ఆధారాలతో బుధవారం హైదరాబాద్‌లోని శంషాబాద్ కాచారంలో ఒక ఇంట్లో రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును ఏపీలోని సిట్ కార్యాలయానికి తరలించారు. అందుకు సంబంధించిన నివేదికను ఏసీబీ కోర్టుకు సిట్ అధికారులు ఈ రోజు సమర్పించారు. ఈ నేపథ్యంలో కోర్టు పైవిధంగా ఆదేశించింది.
మరోవైపు మద్యం కుంభకోణంలో ప్రమేయమున్న రాజ్ కసిరెడ్డి, గోవిందప్ప బాలాజీతోపాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌తోపాటు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. సిట్ అధికారులు వారిని విచారించారు. వాటి ఆధారంగా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో బునేటి చాణక్య, వరుణ్, వినయ్ తదితరులు ఉన్నారు.
ఇంకోవైపు.. ఎన్నికల ఫలితాల్లో కూటమి గెలవడంతో.. ఈ కేసుతో ప్రమేయమన్న పలువురు విదేశాలకు వెళ్లిపోయారు. వారిని సైతం వెనక్కి తీసుకు వచ్చేందుకు సిట్ అధికారులు చర్యలు చేపట్టారు. అదీకాక.. రూ. 3500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగినట్లు ఈ దర్యాప్తులో తెలింది. అందులో రూ. 11 కోట్లను నిన్న సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
2008 మాలేగావ్ బాంబు పేలుడు కేసు.. ఏడుగురు నిర్దోషులుగా విడుదల
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
For More AndhraPradesh News And Telugu News