Thermal Plant Award: కృష్ణపట్నం థర్మల్‌కు పారాదీప్ పోర్టు పురస్కారం
ABN, Publish Date - May 04 , 2025 | 04:46 AM
కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య థర్మల్ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు నిల్వల ఆధారంగా పారాదీప్ పోర్టు వార్షిక పురస్కారాన్ని గెలుచుకుంది. పీఎల్‌ఎఫ్ పెరగడం, నిల్వల నిర్వహణలో విశేష ఫలితాలే దీనికి కారణమని జెన్కో తెలిపింది
అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): బొగ్గు నిల్వలు, గరిష్ఠ స్థాయి విద్యుదుత్పత్తి విభాగాల్లో కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ ప్రాజెక్టుకు పారాదీప్ పోర్టు వార్షిక పురస్కారం లభించింది. ప్లాం ట్ రిలీఫ్ (పీఎల్‌ఎఫ్) ఏకంగా 2.0 శాతం పెరిగి 80శాతానికి చేరుకోవడం, పది నుం చి 13 రోజుల పాటు బొగ్గు నిల్వలు సమకూర్చుకోవడంతో ఈ అవార్డు దక్కింది. ఏపీ జెన్కో ఎండీ కేవీఎన్ చక్రధరబాబు థర్మల్ విద్యుత్తు ప్లాంట్లలో ఉత్పత్తి గరిష్ఠస్థాయిలో ఉండేలా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ అవార్డు దక్కిందని జెన్కోవర్గాలు శనివారం ప్రకటించాయి.
Updated Date - May 04 , 2025 | 04:46 AM