Mithun Reddy SIT Inquiry: న్యాయవాదితో సిట్ విచారణకు మిథున్ రెడ్డి
ABN, Publish Date - Apr 19 , 2025 | 10:22 AM
Mithun Reddy SIT Inquiry: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణం కేసులో ఎంపీని సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు.
విజయవాడ, ఏప్రిల్ 19: వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి (YSRCP MP Mithun Reddy) సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విజయవాడ సీపీ కార్యాలయానికి ఎంపీ చేరుకున్నారు. మిథున్ రెడ్డితో పాటు ఆయన తరఫు న్యాయవాది సోడిశెట్టి మన్మధ రావు హాజరయ్యారు. కాగా.. సిట్ విచారణకు సంబంధించి మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డు చేయాలని కోర్టును అభ్యర్థించారు. అయితే ఇందుకు న్యాయస్థానం తిరస్కరించింది. న్యాయవాది సమక్షంలో విచారణకు అంగీకరించింది. అంతేకాకుండా విచారణకు న్యాయవాది ఆటంకం కలిగించవద్దని.. పది అడుగుల దూరంలో లాయర్ ఉండేలా అవకాశం కలిపిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
అయితే లిక్కర్ స్కాంకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Former MP Vijayasai Reddy) నిన్న (శుక్రవారం) సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా సంచలన విషయాలు బయటపెట్టారు మాజీ ఎంపీ. రాజ్ కసిరెడ్డితో పాటు లిక్కర్ స్కాంతో సంబంధం ఉన్న వారి పేర్లను బయటపెట్టారు. ఈ మొత్తం వ్యవహారం వెనక క్రిమినల్ మాస్టర్ మైండ్ మాత్రం రాజ్ కసిరెడ్డిదే అని మీడియాతో చెప్పుకొచ్చారు మాజీ ఎంపీ. అలాగే రాజ్ కసిరెడ్డి తండ్రిని కూడా రెండు రోజుల పాటు సిట్ అధికారులు విచారించారు. రాజ్ కసిరెడ్డి ఎక్కడ ఉన్నాడు.. ఎక్కడికి వెళ్లాడు అని ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని, కేవలం భార్యకు మాత్రమే మెసేజ్ చేస్తారని సిట్ అధికారులకు చెప్పారు. ఇక ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజ్‌కసిరెడ్డికి కూడా దాదాపు మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన గైర్హాజరయ్యారు. అసలు ఎవరీకి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన ఫోన్లు కూడా స్విచ్‌ఆఫ్ అని వచ్చాయి. దీంతో రాజ్ కసిరెడ్డి తండ్రిని విచారించారు సిట్ అధికారులు.
కాగా.. నిన్నటి విచారణలో మాజీ ఎంపీ సాయిరెడ్డి కొన్ని సంచలన విషయాలను బయటపెట్టడంతో ఈరోజు మిథున్ రెడ్డిని ఎలాంటి ప్రశ్నలు వేయబోతున్నారనే ఆసక్తి నెలకొంది. నిన్న విజయసాయిరెడ్డి 135 ప్రశ్నలు వేశారు అధికారులు. మరి మిథున్ రెడ్డికి ఎలాంటి ప్రశ్నలు సంధించనున్నారు.. అందుకు ఎంపీ ఏ విధంగా సమాధాలు చెబుతారు అనే ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
తల్లి కోరిక మేరకు 60 ఏళ్లకు పెళ్లి చేసుకున్న బీజేపీ నేత
Kids Cough Syrup Ban: నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందుపై ఆంక్షలు
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 19 , 2025 | 12:35 PM