ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vamsi Remand: వంశీ రిమాండ్‌పై కోర్టు ఏం తేల్చిందంటే

ABN, Publish Date - May 06 , 2025 | 12:45 PM

Vamsi Remand: వల్లభనేని వంశీకి మరోసారి నిరాశే ఎదురైంది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో రిమాండ్ ముగియడంతో వంశీని పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

Vamsi Remand Extended

విజయవాడ, మే 6: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి వంశీ రిమాండ్ ముగియడంతో ఈరోజు(మంగళవారం) ఉదయం జిల్లా జైలు నుంచి వంశీని ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. వంశీని కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా వంశీకి ఈనెల 13వ వరకు రిమాండ్‌ను న్యాయస్థానం పొడిగించింది. మరోవైపు వంశీకి కుటుంబసభ్యులతో మాట్లాడేందుకు ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం గంటపాటు అనుమతి ఇచ్చింది. తనకు శ్వాస సమస్య తీవ్రంగా ఉందని ఈ సందర్భంగా వంశీకి కోర్టుకు తెలియజేశారు.


ఈ కేసులో వంశీతో పాటు మరో ఐదుగురు నిందితులకు నేటితో రిమాండ్ గడువు ముగియనుంది. దీంతో వారందరినీ విజయవాడ ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. విచారణ జరిపిన న్యాయస్థానం రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రస్తుతం నిందితులంతా విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో కీలక నిందితులు వంశీతో పాటు వెలినేని శివరామకృష్ణ ప్రసాద్, గంటా వీర్రాజు, నిమ్మ చలపతి, వేల్పూరు వంశీబాబు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కిడ్నాప్‌కు సంబంధించి ఇప్పటికే వంశీని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈకేసులో మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారు. వారి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.


సత్యవర్థన్‌ను ఎందుకు కిడ్నాప్ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు చేశారనే విషయాన్ని రాబట్టాల్సి ఉంది. మద్యవర్తులుగా కొంతమంది కీలకంగా వ్యవహరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో వారిని కూడా పట్టుకోవాల్సి ఉంది. వారిని పట్టుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు చేస్తున్నారు. వంశీపై సత్యవర్థన్ కిడ్నాప్ కేసుతో పాటు మరో రెండు కేసుల్లోనూ అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో రిమాండ్‌ను ఈనెల 13వ వరకు కోర్టు పొడిగించింది.


ఇవి కూడా చదవండి

Supreme Court Richest Judge: సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో సూపర్‌ రిచ్ ఎవరో తెలుసా

Jupally On Miss World Event: మిస్‌ వరల్డ్ పోటీలు ఇందుకోసమే అన్న మంత్రి


Read Latest AP News And Telugu News

Updated Date - May 06 , 2025 | 01:05 PM