AP Govt: విమాన ప్రమాదం.. విజయోత్సవసభ వాయిదా
ABN, Publish Date - Jun 12 , 2025 | 04:49 PM
AP Govt: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
అమరావతి, జూన్ 12: అహ్మదాబాద్ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించ తలపెట్టిన విజయోత్సవ సభను రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా సభను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) నివాసంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేశారు. ఘోర దుర్ఘటన నేపథ్యంలో ప్రభుత్వం ఈరోజు (గురువారం) సాయంత్రం తలపెట్టిన ‘సుపరిపాలనలో తొలిఅడుగు’ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
కాగా.. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద సమయంలో విమానంలో ప్రయాణికులు, సిబ్బంది కలిసి మొత్తం 242 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో మొత్తం 242 మంది మరణించారు. ప్రస్తుతం ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఈ విమానంలో ప్రయాణిస్తున్న గుజరాత్ మాజీ సీఎం విజయ్ రుపానీ కూడా మరణించారు. లండన్‌లో ఉన్న కుమార్తె వద్దకు వెళ్తుండగా విమాన ప్రమాదంలో విజయ్ రూపానీ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ సహా రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.
ఇవి కూడా చదవండి
విమాన ప్రమాదంతో షాక్‌కు గురయ్యా.. చంద్రబాబు ట్వీట్
ఏపీ రైతులకు కేంద్రం శుభవార్త..
Read latest AP News And Telugu News
Updated Date - Jun 12 , 2025 | 05:09 PM