ACB Custody: విడుదల గోపిపై ఏసీబీ ప్రశ్నల వర్షం
ABN, Publish Date - May 01 , 2025 | 12:58 PM
Vidudala Gopi ACB custody: మాజీ మంత్రి విడుదల రజని మరిది విడుదల గోపిని ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గోపినీ ఏసీబీ ప్రశ్నించనుంది.
విజయవాడ, మే 1: స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి, డబ్బులు తీసుకున్న కేసులో మాజీ మంత్రి విడదల రజని మరిది విడుదల గోపిని (Vidudala Gopi) ఏసీబీ అధికారులు (ACB Officers) కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు (గురువారం) ఉదయం విజయవాడ జిల్లా జైలుకు వచ్చిన ఏసీబీ అధికారులు విడుదల గోపిని అక్కడి నుంచి విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం గోపిని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. గోపిని రెండు రోజుల పాటు ఏసీబీ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విచారించేందుకు కోర్టు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో గోపినీ ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇద్దరు న్యాయవాదుల సమక్షంలో గోపినీ ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రెండు రోజుల పాటు విచారణ అనంతరం తిరిగి విజయవాడ జిల్లా జైలుకు గోపిని తరలించనున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గం ఎడ్లపాడు వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషన్ యాజమానిని బెదిరించి సుమారు రూ.2.20 కోట్లు తీసుకున్నారని యాజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధానంగా అప్పటి విజిలెన్స్ ఎస్పీగా ఉన్నా జాషువాకు పది లక్షలు, విడుదల గోపికి పది లక్షలు, మిగితా రెండు కోట్లు అప్పుడు మినిస్టర్‌గా ఉన్న విడుదల రజినీకి ఇవ్వాలని నగదును తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్పీ, గోపి వచ్చి బెదిరించారని, స్టోన్ క్రషర్ సజావుగా సాగేందుకు నగదు చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. విడుదల రజినీ మంత్రిగా ఉన్న సమయలో ఈ వ్యవహారం అంతా నడిచింది. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం, విడుదల రజినీ కూడా పరాభవం చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తనకు జరిగిన అన్యాయంపై స్టోన్ క్రషర్ యజమాని గత ఏడాది పోలీసులను ఆశ్రయించారు. ఈ వ్యహారంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించగా.. రజినీ బలవంతపు వసూళ్లు నిజమే అని విజిలెన్స్ విచారణలో.. అటు ఏసీబీ విచారణలోనూ తేలింది. దీంతో ఏసీబీ అధికారులు.. మొత్తం నలుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో విడదల రజిని (ఏ-1), పి.జాషువా (ఏ-2), విడదల గోపి(ఏ-3), రామకృష్ణ(ఏ-4)గా ఉన్నారు.
ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితమే విడుదల గోపిని హైదరాబాద్‌లో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని.. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి తాడేపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆపై ఏసీబీ కోర్టులో హాజరుపర్చగా.. గోపికీ న్యాయధికారి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆయనను విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. కాగా.. ఈ కేసుకు సంబందించి విడుదల గోపి హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు గోపిని కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గోపిని రెండు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది.
ఇవి కూడా చదవండి
Head Injury: తలకు దెబ్బ తగిలిందా? ఈ మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి
BC Janardhan: పంట నీట మునగడంపై మంత్రి ఆవేదన
Read Latest AP News And Telugu News
Updated Date - May 01 , 2025 | 01:21 PM