AP Govt: మాట నిలబెట్టుకున్న సర్కార్.. రేపే నిధుల విడుదల
ABN, Publish Date - Jun 11 , 2025 | 04:43 PM
AP Govt: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 12న తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబారు సర్కార్ నిర్ణయించింది.
అమరావతి, జూన్ 11: తల్లులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో ముఖ్యమైన పథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తల్లికి వందనం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు (గురువారం) తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. రేపే (జూన్ 12) తల్లికి వందనం నిధులు విడుదల కానున్నాయి. రాష్ట్రంలో మొత్తం 67 లక్షల మందికి తల్లికి వందనం పథకం కింద వారివారి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయనుంది.
ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది సర్కార్. తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది. ఈ మేరకు 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లను కూటమి ప్రభుత్వం జమ చేయనుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం నిధులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు అర్ధరాత్రి నుంచే నిధులు విడుదలకానున్నాయి. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరే విద్యార్ధులకూ తల్లికి వందనం పథకం అమలు కానుంది.
అడ్మిషన్లు పూర్తి అయ్యి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమకానున్నాయి. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేస్తూ ఈరోజు అర్ధరాత్రికి ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలను ప్రభుత్వం అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక తల్లికి వందనం నిధుల విడుదల చేయాలన్న నిర్ణయంతో ఇచ్చిన మాటను నిలుపుకుంది కూటమి సర్కార్.
మహిళా మణులకు కానుకగా : మంత్రి లోకేష్
విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh). కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మణులకు కానుకగా తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. సూపర్ సిక్స్‌లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషమన్నారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అందరికీ 'తల్లికి వందనం' పథకం అందుతుందని తెలిపారు. 67,27,164 మంది విద్యార్థులకు ఈ పథకం కింద, తల్లుల ఖాతాల్లో రూ.8,745 కోట్లు ప్రభుత్వం జమ చేయనుందన్నారు. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకూ తల్లికి వందనం ఇస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు, అన్నా క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2 పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. తల్లికి వందనం అమలుతో ముఖ్యమైన మరో హామీ నెరవేర్చిందంటూ మంత్రి లోకేష్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
ఆ కారణంతోనే మహిళలపై జగన్ కక్ష సాధింపు.. మాజీ మంత్రి ఆగ్రహం
కేసీఆర్ ఓపెన్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు.. చామల సూటి ప్రశ్న
Read latest AP News And Telugu News
Updated Date - Jun 11 , 2025 | 05:21 PM