ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SIT: ఆ ముగ్గురు నిందితుల కోసం సిట్ బృందం వేట

ABN, Publish Date - May 08 , 2025 | 01:08 PM

మద్యం కేసులో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకునేందుకు సిట్ బృందం వేట మొదలు పెట్టింది.

AP Liquor Scam

అమరావతి: మద్యం కేసు (Liquor Case)లో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టు (Supreme Court) ముందస్తు బెయిల్ (Anticipatory Bail) నిరాకరించడంతో సిట్ బృందం వేట ప్రారంభించింది (SIT Launches Hunt). విజయవాడ వెటర్నరీ కాలనీ లోని ఒక అపార్ట్‌మెంట్‌లోని మాజీ సీఎం జగన్ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి (Dhanunjaya Reddy) నివాసంలో సిట్ సోదాలు చేపట్టింది. ఇప్పటికే మద్యం కేసులో మాజీ సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, పీఏ కృష్ణమోహన్ రెడ్డి (Krishna Mohan Reddy), భారతి సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప (Balaji Govindappa)లను సెట్ అధికారులు నిందితులుగా చేర్చారు. నిన్న (బుధవారం) హైకోర్టులో ఆ ముగ్గురికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించిన విషయం తెలిసిందే.

Also Read: ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన


దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకునేందుకు సిట్ బృందం వేట మొదలుపెట్టింది. అయితే ముగ్గురు నిందితులు ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసి లొకేషన్ కూడా దొరకకుండా తప్పించుకు పోయినట్టు సిట్ బృందాలు గుర్తించాయి. దీంతో ముగ్గురి నిందితుల కోసం విజయవాడ, హైదరాబాద్‌లో సిట్ బృందాలు గాలిస్తున్నాయి.


కాగా.. ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా ముందస్తు బెయిల్‌ కోసం సుప్రీం కోర్టుకు వచ్చారు. అయితే దీనికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. అక్కడ న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత ఇక్కడకు రావాలని సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహాదేవన్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ క్రమంలో నిన్న(బుధవారం) ఈ ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. కానీ వీరికి బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. దాంతో ఈరోజు సుప్రీం కోర్టు ముందుకు వచ్చిన ముగ్గురు నిందితులు.. హైకోర్టు నిరాకరించినందుకు తమకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వినతి చేశారు. సుప్రీం ధర్మాసనం కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ తదుపరి విచారణ ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

మిస్ వరల్డ్ పోటీల నిర్వహణతో.. రూరల్ టూరిజం ప్రమోట్..

ఆపరేషన్ సిందూర్‌పై చైనా, అమెరికా స్పందన

For More AP News and Telugu News

Updated Date - May 08 , 2025 | 01:08 PM