ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan: నేను ఆ విషయంలో చాలా బాధ పడుతున్నా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Jan 02 , 2025 | 07:59 PM

Pawan Kalyan: తనకు ఒక్కో పుస్తకం ఒక్కో భావన కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు మన తెలుగు భాష ఎన్నో ప్రేరణలు కలిగిస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan

విజయవాడ: మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సాహితీ వేత్తగా, రచయితగా మహోన్నతులు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. పీవీ గురించి మాట్లాడే అంత జ్ఞానం తనకు లేదని చెప్పారు. తనకు అంత జ్ఞానం వచ్చాక మాట్లాడతానని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రజ్యోతి కృష్ణారావుకు ధన్యవాదాలు తెలిపారు. పీవీ తన గ్రంధాలయం తీసుకుని ఏపీకి వద్దామనుకున్న సమయంలో ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. ఢిల్లీలో పీవీకి సరిగ్గా ఖనన కార్యక్రమం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీకి నివాళి అర్పించడానికి ఢిల్లీలో సమాధి లేదని వాపోయారు. లక్షల మంది ముందుకు వచ్చి ఢిల్లీలో స్మృతి వనం ఏర్పాటు చేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వనవాసి, అక్షర సత్యామృతం, ఏది పాపం, నానీపాల్కే వూది‌ పీపుల్ ఇలా ఎన్నో పుస్తకాలు తాను చదివిన వాటిలో ఉన్నాయని తెలిపారు. .ఇక నుంచి తన ట్విట్టర్‌లో అప్పుడప్పుడు పుస్తకాలపై పోస్ట్ పెడతానని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఓజి ఓజి అంటూ అభిమానుల నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఓజి అనే కన్నా శ్రీశ్రీ అంటే బాగుంటుందని పవన్ కల్యాణ్ చమత్కరించారు.


ఐదో తరగతి నుంచే పుస్తక పఠనం అలవాటు..

శ్రీశ్రీ మహా ప్రస్థానం, విశ్వానాధ సత్యనారాయణ , ఇతర కవులు ఎన్నో వేదనలతో రచనలు చేశారని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఇందిరాగాంధీ స్టేడియంలో 35వ పుస్తక మహోత్సవం జరిగింది. ఇవాళ (గురువారం) పుస్తక మహోత్సవాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి కృష్ణారావు రాసిన పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెంటి శ్రీనివాసరావు, ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగించారు. పుస్తక ప్రదర్శనకు మున్సిపల్ స్టేడియం ఇవ్వడం లేదని తనకు చెప్పారన్నారు. వెంటనే మంత్రి నారాయణ, అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లానని చెప్పారు. పుస్తకాలు మన మైండ్‌కు శిక్షణ ఇస్తాయని.. అందుకే స్టేడియంలో శారీరక ధారుడ్య తరహాలో.. మెదడు ధారుడ్యం కోసం స్టేడియం ఇవ్వాలని చెప్పానని అన్నారు.తనకు నిలబడే ధైర్యాన్ని పుస్తకాలు ఇచ్చాయని ఉద్ఘాటించారు. తనకు ఐదో తరగతి నుంచే పుస్తక పఠనం అలవాటు చేసుకున్నా అని చెప్పారు. మా అమ్మ , నాన్న వల్ల పుస్తక పఠనం అలవాటు అయ్యిందని గుర్తుచేశారు. కోటి రూపాయలు ఇస్తా కానీ, ఒక మంచి పుస్తకం ఇవ్వాలంటే ఎక్కువ సార్లు ఆలోచిస్తానని అన్నారు.తన జీవితంలో పుస్తక పఠనం లేకుంటే తాను ఏమయ్యేవాడినో అనిపిస్తుందన్నారు. తాను కోరుకున్న జీవితం పుస్తకాల్లో కనిపించిందని పవన్ కల్యాణ్ చెప్పారు.


నాకు పుస్తకాలు ప్రాణం...

‘‘నేను మీకు ప్రాణం అయితే... నాకు పుస్తకాలు ప్రాణం. నేను మీ నుంచి ఇంతటి అభిమానం పొందానంటే నాకు పుస్తక పఠనమే కారణం. నాకు పుస్తకం చదివి అర్ధం చేసుకోవడం తెలుసు. అక్షర యుద్ధం ఒక్కరి అలోచన ద్వారా రావాలి. భగవంతుని ఆశీస్సులు ఉంటే ఒక పుస్తకం రాస్తా. సూర్య నాగేంద్రుని నిఘంటువు మళ్లీ ముద్రించాలని‌ ఉంది. నేను కొంత వరకు భరిస్తా.. ప్రభుత్వం కూడా సహకారం ఇవ్వాలని‌ కోరతా. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటు చేసుకోండి. మీ భవిష్యత్తు కు ఒక ధైర్యం ఇస్తుంది. యువత పుస్తకాలు కొనండి, చదవండి, చదివించండి. అధ్యాపకులకు అధికంగా జీతాలు ఉండాలి. సమాజాన్ని‌ ప్రభావితం చేసే అధ్యాపకులకు గుర్తింపు ఉండాలి. చిరిగిన చొక్కా తొడుక్కో‌కానీ, ఒక మంచి పుస్తకం కొనుక్కో. నాకు పుస్తకాలు పక్కన ఉన్నప్పుడు ఎంతో ధైర్యం ఉండేది. మా‌వదినను డబ్బులు అడిగి తీసుకుని పుస్తకాలు కొనేవాడిని. నా కోరికలకు డబ్బులు సరి‌పోయేవి కాదు. తొలిప్రేమ సినిమా తర్వాత రెండు లక్షలు పెట్టి పుస్తకాలు కొన్నాను. అన్ని పుస్తకాలు నా రూమ్‌లో‌ చూసుకుని సంబరపడ్డా. జీవిత కాలంలో ఒక మనిషి పది వేల‌ పుస్తకాలు చదవొచ్చు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవాటుగా మార్చుకోండి. అభిమానులు అరవడం కాదు.. పుస్తకం చదవాలన్న నా పిలుపును ఆచరించాలి’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఇంటర్‌తో చదువు ఆపేశాను..

‘‘రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంట్లో ఉండి చదివినట్లు నేనూ ఇంట్లో పుస్తకాలు చదివాను. నేను స్వతంత్రంగా నేర్చుకోగలను అనే బలం ఇచ్చింది పుస్తకమే. నేను చదువు ఇంటర్‌తో ఆపేశాను... కానీ పుస్తకాలు చదవడం మానలేదు. నా మానసిక శక్తి బలంగా ఉందంటే పుస్తకమే కారణం. మా అన్నయ్య, వదినలు కూడా నన్ను అడిగేవారు.. అమృతం కురిసిన రాత్రి పుస్తకం, నేను తొలిసారిగా కొన్నాను. కొత్త పుస్తకాల సువాసన .. మట్టి వాసన లాగా చాలా బాగుంటుంది. రాజకీయాల్లో ఇంత బలంగా నిలబడ్డానంటే పుస్తక పఠ‌నం కారణం. కథల్లో ఉన్న భావాలు, కష్టం, నష్టంపై బాగా ఆలోచనలు చేసే వాడిని. విశ్వనాథ సత్యనారాయణ రచనలు ‘‘ఆహా ఓహో’’ నన్ను ఆలోచింప చేసింది. గుర్రం జాషువా ‘‘ఫిరదౌసి’’ నన్ను చాలా ఆకట్టుకుంది. ఎడ్వంచర్ అంటే ‘‘బంగారం చేయడం ఎలా’’ అనే పురుషోత్తం పుస్తకం చదివా. గోపీచంద్ రచనలు సమాజంలో మంచి చెడులు తెలుపుతాయి’’ అని పవన్ కల్యాణ్ తెలిపారు.


జ్ఞానుల గురించి చెప్పాలి..

‘‘ఒక్కో పుస్తకం ఒక్కో భావన కలిగించింది. మన తెలుగు భాష ఎన్నో ప్రేరణలు కలిగిస్తుంది. నా లాంటివాళ్లు పాపులర్ ఫిగర్. కానీ జ్ఞానం ఉన్న వాళ్లు ఎక్కువుగా మాట్లాడరు. నాలాంటి‌వాళ్లు అలాంటి జ్ఞానుల గురించి చెప్పాలి. పాపులారిటీ ఉన్న వారంతా మేధావులు కాదు..‌నాతో సహా. ఒక‌కథ, స్కీన్ ప్లే, ఒక స్పీచ్ రాయాలంటే ఎంతో వేదన పడాలి. నేను తెలుగును సరిగ్గా నేర్చుకోనందుకు చాలా బాధ పడుతున్నాను. ఆరోజు మా టీచర్లు చెప్పింది అర్ధం‌చేసుకోలేదు. ఇప్పుడు నేర్చుకోవాలన్నా సాధ్యం కాదు. విద్యార్థులు తెలుగు వ్యాకరణంపై దృష్టి పెట్టాలి. ఇంగ్లీషు నేర్చుకోండి, మాతృభాష ద్వారానే పట్టు‌ సాధ్యం. ఇంగ్లీషు వల్లే అంతా జరిగిపోదు, ఉద్యోగాలు వచ్చేయవు. మనలో సృజనాత్మకత ఉండాలంటే మాతృభాషపై పట్టు ఉండాలి.నేను రచయిత కాదు.. వారి కష్టాన్ని అర్ధం చేసుకున్నా. నాకు రచయితలు, కవులపై చాలా గౌరవం ఉంది. విదేశాల్లో రచయితలు ఇళ్లకు ప్రత్యేక గుర్తింపు ఉంది. మన దగ్గర కూడా అలాంటి కవుల ఇళ్లకు వెళ్లాలి, రచయితలు ఇళ్లను టూరిజంగా అభివృద్ధి చేయాలి. కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఆలోచనలు చేసి అమలు చేస్తుంది. ఇలాంటి వేదికలు లేకుంటే సాహితీ వేత్తలను కలిసే అవకాశం ఉండేది కాదు. గ్రంథాలయాలు ఏర్పాటుపై ఉద్యమంగా పోరాటం చేయాలి. పుస్తకం రాయాలి అంటే ఎంత కష్ట పడాలో తెలుసుకోండి. ఇది అర్థం చేసుకుంటే మనకు రచయితలపై గౌరవం పెరుగుతుంది’’ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


పీవీ నరసింహారావు ఒక ధిక్కార స్వరం: ఎ.కృష్ణారావు

మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఒక ధిక్కార స్వరమని ఆంధ్రజ్యోతి అసోసియేట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు తెలిపారు. తెలుగునాట కొద్ది మందికే అలా ఉంటుందని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడుగా ఉన్న సీఎం, పీఎం ఎంతో‌కాలం తర్వాత పీవీకి దక్కిందని చెప్పుకొచ్చారు. అలాంటి ధీరత్వం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌లోనే తాను చూశానని చెప్పారు. ఓడినా ...‌ప్రజల‌కోసం పవన్‌కల్యాణ్‌ ముందుకు నడిచారని గుర్తుచేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగాను ముందు వరుసలో ఉన్నారని తెలిపారు. ఓడినవారు పవన్‌కల్యాణ్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు. అలాంటి వారు చరిత్రలో నిలిచిపోతారని కృష్ణారావు తెలిపారు. పవన్‌కల్యాణ్‌ భవిష్యత్‌లో తప్పకుండా లక్ష్యాలను సాధిస్తారని ఎ.కృష్ణారావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Chandrababu: రెవెన్యూ అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. కారణమిదే..

AP News: ఏపీ క్యాబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు..

AP Politics: టీడీపీ వర్సెస్ వైసీపీగా మండల సర్వసభ్య సమావేశం.. మాటల యుద్ధానికి దిగిన ఇరువర్గాలు..

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ మీటింగ్... కీలక అంశాలకు ఆమోద ముద్ర

Read Latest AP News and Telugu News

Updated Date - Jan 02 , 2025 | 08:28 PM