ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fire Accident: ఎన్టీటీపీఎస్‌లో భారీ అగ్నిప్రమాదం.. గోప్యంగా ఉంచిన అధికారులు..

ABN, Publish Date - Mar 19 , 2025 | 12:03 PM

ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు తెలుస్తోంది.

Fire Accident in NTTPS

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్(NTTPS) కోల్ ప్లాంట్‌లో ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం(Fire Accident) సంభవించింది. ఎన్టీటీపీఎస్ అధికారుల నిర్లక్ష్యంతో స్టేజ్-1 బంకర్‌కి వెళ్లే కన్వేయర్ బెల్ట్(Conveyor Belt) 40 మీటర్ల మేర దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంతో 420 యూనిట్ల మేర విద్యుత్ నిలిపివేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే పెద్దఎత్తున ప్రమాదం జరిగినప్పటికీ విషయాన్ని బయటకు పొక్కకుండా అధికారులు గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

Updated Date - Mar 19 , 2025 | 02:09 PM