ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

AP Liquor Scam ED: లిక్కర్ స్కాంలో కొత్త మలుపు.. రంగంలోకి ఈడీ

ABN, Publish Date - May 08 , 2025 | 02:19 PM

AP Liquor Scam ED: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక మలుపు చోటు చేసుకుంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రంగం సిద్ధం చేసింది

AP Liquor Scam ED

అమరావతి, మే 8: ఏపీలో (Andhrapradesh) సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Scam) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదుకు రంగం సిద్ధం చేసింది ఈడీ. పీఎమ్‌ఎల్‌ఏ సెక్షన్ కింద కేసు నమోదుకు తమకు డాక్యుమెంట్లు కావాలని సిట్ అధిపతి, విజయవాడ సీపీకి ఈడీ లేఖ రాసింది. అలాగే కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, ఇప్పటి వరకు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్లు వివరాలు పంపాలని ఈడీ కోరింది.


రాష్ట్రంలో పెను దుమారం రేపుతోన్న లిక్కర్ స్కాం‌కు సంబంధించి సిట్ ఇప్పటికే ఎంతో సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు ఆయన పీఏ పైలా దిలీప్‌ను అరెస్ట్ చేసింది. వారిని కస్టడీలోకి తీసుకుని లిక్కర్‌ స్కాంకు సంబంధించి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే ఈ కేసులో మరికొన్ని అరెస్ట్‌లు కూడా జరిగాయి. ఈ కేసుకు సంబంధించి పలువురికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు వారిని విచారించారు కూడా. లిక్కర్ స్కాం కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ తమకు మధ్యంతర రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టులను కోరినప్పటికీ వారికి నిరాశే ఎదురైంది.


ఈ కేసు మొదలైనప్పుడే ఈ ముగ్గురు కూడా సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టులో ఈ కేసు పెండింగ్‌లో ఉన్నందున అక్కడ తేల్చుకుని రావాలని సుప్రీం సూచించింది. అయితే ఈ ముగ్గురు నిందితులకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో వెంటనే వారు ఈరోజు సుప్రీంలో పిటిషన్‌ వేశారు. మధ్యంతర రక్షణ కల్పించాలని కోరారు. అందుకు సుప్రీంకోర్టు కూడా నిరాకరించింది. గతంలో వేసిన పిటిషన్‌‌ను సవరణ చేయాలని లేదా కొత్త పిటిషన్‌ను వేయాలని సుప్రీం కోర్టు తెలియజేస్తూ విచారణను వాయిదా వేసింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించడంతో ఈ ముగ్గురి కోసం సిట్ బృందం వేట మొదలుపెట్టింది. విజయవాడ, హైదరాబాద్‌లలో వీరి కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. కానీ ఈ ముగ్గురు తమ సెల్‌ఫోన్లను స్విచ్‌ఆఫ్ పెట్టుకున్నట్లు సిట్ గుర్తించింది.


ఇవి కూడా చదవండి

Jethwani Case: ఇద్దరు ఐపీఎస్‌లకు హైకోర్టులో బిగ్ రిలీఫ్

Pawan Viral Tweet: ప్రధాని మోదీపై పవన్ సంచలన ట్వీట్

Read Latest AP News And Telugu News

Updated Date - May 08 , 2025 | 04:47 PM