CII Annual Summit: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు
ABN, Publish Date - May 30 , 2025 | 07:49 AM
CII Annual Summit: సీఎం చంద్రబాబు నాయుడు కడపలో మూడు రోజుల మహానాడు కార్యక్రమాలు ముగించుకుని గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న సీఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొననున్నారు.
న్యూఢిల్లీ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఢిల్లీ పర్యటన (Delhi visit)లో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీలో జరగనున్న సీఐఐ వార్షిక సమ్మేళనంలో (CII Annual Summit) పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి (AP development plans), పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను సీఐఐ సభ్యులకు ముఖ్యమంత్రి వివరించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తి కాగానే ఢిల్లీ నుంచి సీఎం చంద్రబాబు విజయవాడకు వస్తారు. ఈ రోజు రాత్రి 8.30 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఇక్కడ పనులు పూర్తి చేసుకుని శనివారం రాజమండ్రి పర్యటనకు వెళతారు.
ఢిల్లీలో సీఎంకు టీడీపీ నేతల స్వాగతం..
సీఎం చంద్రబాబు నాయుడు కడపలో మూడు రోజుల మహానాడు కార్యక్రమాలు ముగించుకుని గురువారం సాయంత్రం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. విమానాశ్రయంలో చంద్రబాబుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, సానా సతీష్‌తో సహా పలువురు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి నేరుగా అధికారిక నివాసం వన్‌జన్‌పథ్‌కు ముఖ్యమంత్రి వెళ్లారు. ఈరోజు సీఐఐ సదస్సుకు చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
Also Read: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కీలక నిర్ణయం
శనివారం రాజమండ్రి పర్యటనకు..
సీఐఐ సదస్సు పూర్తి కాగానే అక్కడి నుంచి బయలుదేరి రాత్రికి విజయవాడ చేరుకుంటారు. శనివారం రాజమండ్రికి సీఎం చంద్రబాబు వెళతారు. ముమ్మిడివరం నియోజకవర్గం గున్నేపల్లిలో పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో శనివారమే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. అలాగే గున్నేపల్లి గ్రామస్తులతో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం ప్రజలను అడిగి వారి సమస్యలను తెలుసుకోనున్నారు.
కాగా గురువారం మహానాడు ప్రాంగణం నుంచి ఎయిర్ పోర్టుకు సీఎం చంద్రబాబు బయలుదేరారు. ఆయనను చూసేందుకు దారి పొడుగునా రోడ్లకు ఇరువైపులా శ్రేణులు బారులు దీరారు. పార్టీ శ్రేణుల కోలాహలంతో నెమ్మదిగా సీఎం కాన్వాయ్ వెళ్లింది. ఎయిర్ పోర్టుకు వెళ్లే మార్గంలో రెండుసార్లు ఆగి ప్రజలకు చంద్రబాబు అభివాదం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పాక్ ర్యాలీలో ‘పహల్గాం’ సూత్రధారి
జర్నలిస్టుల అక్రిడేషన్ మరో మూడు నెలలు పొడిగింపు
For More AP News and Telugu News
Updated Date - May 30 , 2025 | 07:49 AM