ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu Delhi: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. ఏం చర్చించారంటే

ABN, Publish Date - May 23 , 2025 | 04:01 PM

CM Chandrababu Delhi: కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ను అంతరిక్ష తయారీ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్రమంత్రికి సీఎం ప్రతిపాదనను సమర్పించారు.

CM Chandrababu Delhi

న్యూఢిల్లీ, మే 23: హస్తినలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీలు అవుతున్నారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ, భూ విజ్ఞాన శాఖల మంత్రి జితేంద్ర సింగ్‌తో (Union Minister Jitendra Singh) సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతరిక్ష తయారీ, ఆవిష్కరణలకు కీలక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు కోరుతూ ఒక సమగ్ర ప్రతిపాదనను సీఎం సమర్పించారు. ఈ ప్రతిపాదనలో రాష్ట్ర మద్దతుతో రెండు స్పేస్ సిటీల అభివృద్ధికి సంబంధించిన వివరాలున్నాయి. వీటిలో ఒకటి ఇస్రో షార్ అంతరిక్ష కేంద్రం సమీపంలో, మరొకటి లేపాక్షి వద్ద ఉంటాయి. ఉపగ్రహాల ఉత్పత్తి, ప్రయోగ వాహనాల అభివృద్ధి, పరిశ్రమల సహకారానికి ఇవి సమగ్ర కేంద్రాలుగా ఉపయోగపడనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంతరిక్ష సాంకేతికత సలహాదారుగా ఇస్రో మాజీ ఛైర్మన్ డా.ఎస్. సోమనాథ్ నియామకం గురించి కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా తెలియజేశారు.


ఆయన మార్గదర్శకత్వంలో అంతర్జాతీయంగా పోటీపడే అంతరిక్ష ఎకోసిస్టంను నిర్మించడంలో రాష్ట్ర ప్రయత్నాలకు ఈ నియామకం దిశానిర్దేశం చేస్తుందని వివరించారు. వ్యూహాత్మక స్థానం, పారిశ్రామిక బలం, భవిష్యత్తుకు సిద్ధమైన మౌలిక సదుపాయాలతో, భారతదేశ అంతరిక్ష రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కేంద్రం ఈ విప్లవాత్మక మార్పులను గుర్తించి, తగిన భాగస్వామ్యం కల్పిస్తుందనే ఆశాభావాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు.


అంతకుముందు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ను సీఎం కలిశారు. ఈ సమావేశంలో పోలవరం - బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనను సమర్పించారు. గోదావరి వరద నీటిని ఏపీలోని కరువు పీడిత ప్రాంతాలకు మళ్లించడమే ఈ ప్రతిపాదిత ప్రాజెక్టు లక్ష్యం. జల్ జీవన్, బ్లూ రివల్యూషన్, మేక్ ఇన్ ఇండియా వంటి జాతీయ మిషన్ల అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత దిగువ రాష్ట్రంగా మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న హక్కును కూడా ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు. పోలవరం-బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించిన వివరాల డీపీఆర్ త్వరలో సమర్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రాజెక్టు పనులను త్వరగా ముందుకు తీసుకెళ్లడానికి తక్షణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్రమంత్రిని సీఎం చంద్రబాబు అభ్యర్థించారు.


కాగా.. ఈరోజు (శుక్రవారం) ఉదయం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీతో సీఎం సమావేశమై... ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు సహకారంపై చర్చించారు. పీఎం సూర్యఘర్ యోజన కింద 20 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహాలకు సోలార్ రూఫ్ టాప్ కేటాయింపులు ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. కేంద్రం సహకరిస్తే పునరుద్పాదన ఇంధన వినియోగంలో ఏపీ.. భవిష్యత్‌లో దేశానికి మార్గనిర్దేశం చేయగలదని అన్నారు. ఆపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు.. ఏపీలో వ్యూహాత్మక రక్షణ, ఏరో స్పేస్ ప్రాజెక్టులపై చర్చించారు.


ఇవి కూడా చదవండి

Covid 19: కరోనా కలకలం.. ఏపీలో మరో కేసు

ఎలుగుబంటి హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:03 PM