ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SIT Custody: తప్పు చేస్తున్నారు.. మూల్యం తప్పదు.. జైలు వద్ద చెవిరెడ్డి హంగామా

ABN, Publish Date - Jul 02 , 2025 | 10:39 AM

SIT Custody: మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెండో రోజు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు కూడా జైలు ముందు హంగామా చేశారు చెవిరెడ్డి.

SIT Custody

విజయవాడ, జులై 2: ఏపీ మద్యం కుంభకోణం కేసులో (AP Liquor Case) రిమాండ్‌ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ 38గా చెవిరెడ్డి ఉన్నారు. మూడు రోజుల పాటు మాజీ ఎమ్మెల్యేను సిట్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు అనుమతించింది. దీంతో రెండో రోజు విచారణ నిమిత్తం ఆయనను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకుని సిట్ కార్యాలయానికి తరలించారు. అయితే జైలు వద్ద మరోసారి హంగామా సృష్టించారు చెవిరెడ్డి. జైలు నుంచి బయటికి వచ్చే సమయంలో సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని అరుస్తూ హడావుడి చేశారు. తప్పులు చేసే అధికారులు తర్వాత మూల్యం చెల్లించుకోవలసి వస్తుందంటూ వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హెచ్చరించారు.

కాగా... తొలిరోజు కస్టడీకి తీసుకునే సమయంలో కూడా జైలు వద్ద చెవిరెడ్డి హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. తనపై అన్యాయంగా కేసు పెట్టారని, అధికారంలోకి వచ్చాక ఎవ్వరినీ వదలమంటూ హెచ్చరిస్తూ పోలీసు జీపు ఎక్కారు మాజీ ఎమ్మెల్యే. ఇక ఈ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పీఏలు బాలాజీ, నవీన్‌ను ఇండోర్‌లో అదుపులోకి తీసుకున్న సిట్ పోలీసులు విజయవాడకు తీసుకొచ్చారు. ముందుగా వారిని ఇండోర్‌ కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. ఆపై ట్రాన్సిట్ వారెంట్‌పై విజయవాడకు తీసుకొచ్చారు. ఈరోజు బాలాజీ, నవీన్‌లను సిట్ పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు.

ఇవి కూడా చదవండి

మేడారం మహాజాతర తేదీలు ఖరారు

Shikhar Dhawan: ఆ రోజే నా కెరీర్ క్లోజ్.. ధవన్ షాకింగ్ కామెంట్స్!

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 02 , 2025 | 11:26 AM