ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Amaravati Quantum Valley Declaration: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ

ABN, Publish Date - Jul 07 , 2025 | 01:21 PM

Amaravati Quantum Valley Declaration: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్‌‌ను జూన్ 30న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డిక్లరేషన్‌పై నేడు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Amaravati Quantum Valley Declaration

అమరావతి, జులై 7: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ (Amaravati Quantum Valley Declaration) ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 23ను ఐటీ ఎలక్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని ఈరోజు (సోమవారం) జారీ చేశారు. జూన్ 30న విజయవాడలో ‘అమరావతి క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్’‌ను ‌ నిర్వహించినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ వర్క్‌షాప్‌ ద్వారా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలిసి కొత్త టెక్నాలజీని సమన్వయంతో పనిచేసే దిశగా చర్చలు జరిగాయన్నారు.

అమరావతిని గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్‌’ను జూన్ 30న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డిక్లరేషన్‌పై నేడు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ద్వారా క్వాంటం పరిశోధన, ఆవిష్కరణ, ప్రతిభ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనునట్టు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద క్వాంటం బెడ్‌గా క్వూ - చిప్ - ఇన్‌ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటం కేంద్రంగా అమరావతి అభివృద్ధే లక్ష్యమని ఉత్తర్వుల్లో తెలిపారు. 2026లో ప్రారంభం అయ్యే అమరావతి క్వాంటం అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇవి కూడా చదవండి

వీఆర్‌ స్కూల్ అద్భుతం.. ఆ ఇద్దరి కృషి చాలా గొప్పది: మంత్రి లోకేష్

మామిడి కొనుగోలుపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

Read latest AP News And Telugu News

Updated Date - Jul 07 , 2025 | 01:25 PM