ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Covid 19: కరోనా కలకలం.. ఏపీలో మరో కేసు

ABN, Publish Date - May 23 , 2025 | 01:25 PM

Covid 19: ఏపీలో కరోనా కేసులు క్రమ క్రమంగా పెరుగుతున్నాయి. నిన్న విశాఖలో ఒక కొవిడ్ పాజిటివ్ కేసు నమోదు అవగా.. తాజాగా కడప జిల్లాలో మరో కేసు వచ్చింది.

Covid 19

కడప, మే 23: ఏపీ‌లో (Andhrapradesh) కరోనా కేసులు (Covid 19) నమోదు కలకలం రేపుతోంది. కడపలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయ్యింది. నంద్యాల జిల్లా చాగలమర్రికి చెందిన 75 ఏళ్ల మహిళ అనారోగ్యంతో రెండు రోజుల క్రితం కడప రిమ్స్‌‌లో చేరింది. వృద్ధురాలికి తీవ్ర జ్వరం ఉండటంతో అనుమానించిన వైద్యులు గత రాత్రి కరోనా పరీక్షలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు కరోనా సోకినట్లు రిమ్స్ వైద్యులు తేల్చారు. వృద్ధురాలికి వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఇక కడప జిల్లాలో మరోసారి మొదటిగా ఒక కరోనా కేసు వెలుగులోకి రావడంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న విశాఖలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు రెండు కరోనా కేసులు నమోదు అయ్యాయి.


విశాఖలో వివాహితకు కరోనా పాజిటివ్ అని తేలింది. మద్దెలపాలెంలోని పిఠాపురం కాలనీకి చెందిన 28 ఏళ్ల మహిళకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వివాహిత చలి జ్వరం, తీవ్రమైన దగ్గుతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. వైద్య పరీక్షల్లో కోవిడ్ 19గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆరోగ్య శాఖ అధికారులు కేజీహెచ్‌లో మరోసారి శాంపిల్‌ను పరీక్షించగా అది కూడా పాజిటివ్‌ గానే నిర్ధారణ అయ్యింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండగా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయగా హోం ఐసోలేషన్‌లో ఉంచారు.


ఆ వెంటనే ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మద్దెలపాలెంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. వివాహిత కుటుంబ సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు నమూనాలు సేకరించి కేజీహెచ్‌కు పంపించారు. వారందరూ కూడా హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. కాగా.. ఇప్పటికే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనాకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గ్రూప్‌గా ఉన్న చోట తిరగవద్దు అంటూ పలు ఆదేశాలను ఈనెల 21నే వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చింది.


ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాస్కులు కచ్చితంగా వాడాలని పేర్కొంది. అలాగే చలి జ్వరం , దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి-వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాల నొప్పులు, బాడీ పెయిన్స్, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే వెంటనే ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. రైల్వే‌స్టేషన్లు , బస్టాండ్లు విమానాశ్రయాలు వంటి వాటిలో కోవిడ్ నిబంధనలు పాటించాలని ఏపీ ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.


ఇవి కూడా చదవండి

కేంద్రమంత్రి జోషితో భేటీ‌పై సీఎం చంద్రబాబు ట్వీట్

ఎలుగుబంటి హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు

Read Latest AP News And Telugu News

Updated Date - May 23 , 2025 | 01:51 PM