ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Alamuru court: ఆకతాయిలకు శిక్ష.. ఆ వెంటనే అమలు!

ABN, Publish Date - May 17 , 2025 | 04:42 AM

అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తించిన పదిమంది యువకులకు రూ.100 జరిమానా విధించి, పరిసరాలను శుభ్రం చేయించాలని శిక్ష తక్షణమే అమలు చేశారు. వారి శిక్షగా పోలీసులు చీపుర్లు అందించి సబ్‌ట్రెజరీ కార్యాలయాన్ని శుభ్రం చేయించారు.

ఆలమూరు, మే 16(ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న పలువురు ఆకతాయిలకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఆలమూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌ శిక్ష వేసి వెంటనే అమలు చేయించే విధంగా వినూత్న తీర్పును ఇచ్చారు. మండపేట టౌన్‌లో గురువారం రాత్రి మద్యం సేవించి అల్లరి చేస్తున్న పదిమంది యువకులను మండపేట టౌన్‌ ఎస్‌ఐ చంటి అరెస్టు చేశారు. వీరిని శుక్రవారం ఆలమూరు కోర్టులో హాజరుపరచగా, ఒక్కొక్కరికీ రూ.100 జరిమానాతోపాటు వారితో పరిసరాలను పరిశుభ్రం చేయించాలని న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌ తీర్పు చెప్పారు. దీంతో పోలీసులు వారికి చీపుర్లు ఇచ్చి, కోర్టుకు పక్కనే ఉన్న సబ్‌ట్రెజరీ కార్యాలయాన్ని శుభ్రం చేయించారు. శిక్షను తక్షణం అమలు చేయించడంతో అంతా ఆసక్తిగా తిలకించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 04:42 AM