ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mango Farmers: రాజకీయ లబ్ధి కోసమే వచ్చారు

ABN, Publish Date - Jul 10 , 2025 | 03:01 AM

రైతులతో ముఖాముఖి పేరుతో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బంగారుపాళ్యం రావడాన్ని మామిడి రైతులు తప్పుబట్టారు.

  • చిత్తశుద్ధి ఉంటే ఆయన డబ్బిచ్చి ఆదుకోవాలి

  • జగన్‌ పర్యటనపై మామిడి రైతులు

బంగారుపాళ్యం, జూలై 9(ఆంధ్రజ్యోతి): రైతులతో ముఖాముఖి పేరుతో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బంగారుపాళ్యం రావడాన్ని మామిడి రైతులు తప్పుబట్టారు. ఆయన రాకవల్ల ఏమీ ఉపయోగం ఉండదన్నారు. ఆయన పర్యటన కేవలం రాజకీయ లబ్ధికోసమేనని పలువురు రైతులు అభిప్రాయపడ్డారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఆయన డబ్బిచ్చి ఆదుకోవాలన్నారు. పంట కోత దశలో మామిడి రైతులను, వ్యాపారులను తప్పుదోవ పట్టించేందుకే ఈ పర్యటన అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

కోతలు లేక 50 టన్నుల మేర నష్టం

నాకున్న రెండు మామిడి కాయల మండీలకు సుమారు 100 టన్నుల మేర తోతాపురి కాయలు వచ్చేవి. జగన్‌ పర్యటనతో రైతులెవరూ కాయలు తీసుకురాలేదు. దీంతో కాయలను కోయకపోవడంతో బంగారుపాళ్యం మండ ల రైతులకే సుమారు 50 టన్నుల మేర నష్టం వాటిల్లింది. మార్కెట్‌ యార్డులో 113 మామిడి మండీలున్నాయి. ఒక్కో మండీకి 4 టన్నులనుకున్నా ఈ రోజు 452 టన్నులు రావాల్సి ఉంది. అయితే జగన్‌ పర్యటన వలన రైతులు కాయలు కోయకపోవడంతో అవి తోటలోనే మాగి రాలిపోయే పరిస్థితి నెలకొంది. కాయల కోత సమయంలో ఇలా పర్యటనల పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జగన్‌కు తగదు.

- చక్రధరరావు,

మండీ వ్యాపారి

పర్యటనతో మాకేం లాభం లేదు

జగన్‌ యాత్ర వల్ల మాకేం లాభం లేదు. రైతులను ఆదుకోవడం కన్నా రాజకీయ లబ్ధికోసమే ఆయన వచ్చినట్లు అన్పిస్తోంది. నాకున్న 15 ఎకరాల మామిడి తోటలో సుమారు 75 టన్నుల తోతాపురి ఈ సంవత్సరం కాపు కాసింది. కాయలను చిత్తూరు, నలగాంపల్లె గుజ్జుపరిశ్రమలకు తరలించగా టన్ను రూ. 6 వేల చొప్పున కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ రూ.4 కోసం సంబంధిత అధికారుల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేశా. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ మాకు కొంత ఊరటను ఇచ్చింది.

- చంద్రయ్య, బోడబండ్ల

కూలీలు లేక కాయలు కోయలేదు

జగన్‌ పర్యటన వల్ల కూలీలు, మామిడి రైతులు నష్టపోయారు. కాయ లు కోద్దామనుకుంటే కూలీ లు దొరకలేదు. నాకు 10 ఎకరాల మామిడి తోపు ఉంది. ఈ ఏడాది సుమారు 100 టన్నుల పంట వచ్చింది. ఇప్పటికే 60 టన్నుల కాయలు కోసి ఫ్యాక్టరీలకు తరలించా. జగన్‌ పర్యటనతో ఈ రోజు మండీలు లేక కాయలు కోయలేదు. దాని వల్ల కాయలు రాలి పడిపోయాయి.

- గిరి, టేకుమంద

Updated Date - Jul 10 , 2025 | 03:01 AM