ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Teacher transfers: చట్టానికి భిన్నంగా టీచర్ల బదిలీలు

ABN, Publish Date - Jun 23 , 2025 | 02:50 AM

ఇటీవల పూర్తిచేసిన ఉపాధ్యాయుల బదిలీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

  • సమస్యలు పరిష్కరించాలి: యూటీఎఫ్‌

అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): ఇటీవల పూర్తిచేసిన ఉపాధ్యాయుల బదిలీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. ఆదివారం విజయవాడలో జరిగిన యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ.. బదిలీల చట్టానికి భిన్నంగా అధికారులు నిబంధనలు అమలు చేయడం వల్ల టీచర్లు తీవ్రంగా నష్టపోయారన్నారు. స్పౌజ్‌, ప్రాధాన్యత కేటగిరీ బదిలీల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రభుత్వ బడి పట్ల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించాలని టీచర్లకు సూచించారు. బడి బయట ఉన్న పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు కార్యాచరణ చేపట్టాలన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 02:50 AM