ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Polavaram Green Signal: ఆలోగా ప్రాథమిక పనులకు ఓకే

ABN, Publish Date - May 08 , 2025 | 04:55 AM

2-Line Telugu Summary (Continued Para Style): పోలవరంలో డయాఫ్రం వాల్‌, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ ప్రధాన నిర్మాణాలపై డిజైన్‌లు సిద్ధమైనంత వరకు ప్రాథమిక పనులు ప్రారంభించేందుకు అంతర్జాతీయ నిపుణులు అనుమతి ఇచ్చారు. భూకంప ప్రభావంపై సమగ్ర అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని వారు తెలిపారు

  • భూకంప తీవ్రతపైనా అధ్యయనం చేస్తాం

  • ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు చేపట్టండి

  • వారం రోజుల్లోగా డిజైన్లను ఆమోదిస్తాం

  • పోలవరంపై అంతర్జాతీయ నిపుణుల బృందం

అమరావతి, పోలవరం, మే 7 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రంవాల్‌.. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ గ్యాప్‌-1, గ్యాప్‌-2, జీ-హిల్స్‌, డి-హిల్స్‌ పనుల డిజైన్లు ఆమోదం పొందేలోగా.. ప్రాథమిక పనులు ప్రారంభించవచ్చని ఇంజనీరింగ్‌ అధికారులు, నిర్మాణ సంస్థలకు అంతర్జాతీయ నిపుణుల బృందం సలహా ఇచ్చింది. గ్యాప్‌-2 ప్రాంతంలో చేపట్టే నిర్మాణ పనులకు సంబంధించి భూకంప తీవ్రతపైనా అధ్యయన నివేదిక ఇస్తామని, తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. ఈ నెల 5వ తేదీ నుంచి పోలవరం ప్రాంతంలో అమెరికా, కెనాడాలకు చెందిన నలుగురు అంతర్జాతీయ నిపుణుల బృందం పర్యటిస్తోంది. వారితోపాటు సీడబ్ల్యూసీ, సీఎస్ఎంఆర్‌ఎస్‌, వాప్కోస్‌, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, జలవనరుల శాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం. వెంకటేశ్వరరావు, సీఈ నరసింహమూర్తి తదితరులు మూడు రోజులుగా పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో ప్రధాన డ్యామ్‌ పనులను పరిశీలిస్తున్నారు.


ఈ మూడు రోజుల పరిశీలనపై గురువారం ఉదయం సమీక్షించిన తర్వాత.. పనులు ముందుకు సాగడంపై నిపుణుల బృందం సలాహాలు, సూచనలు ఇస్తుంది. గురువారం మధ్యాహ్నం బృంద సభ్యులు వారి స్వదేశాలకు పయనమవుతారు. కాగా, బుధవారం నాటి పర్యటనలో అంతర్జాతీయ నిపుణుల బృంద సభ్యులు ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా గ్యాప్‌-1, గ్యాప్‌-2 ప్రాంతంలో బంకమట్టిని పటిష్ట పరచడం, ఇసుకను తవ్వడం, నేలను పటిష్టపరచడం వంటి వాటిని పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు కంపెనీలతో సమీక్ష నిర్వహించారు. డయాఫ్రంవాల్‌, బట్రస్‌ డ్యాంల నిర్మాణం విషయంలో అధికారులకు పలు సూచనలు చేశారు. సమావేశంలో విదేశీ నిపుణులు డేవిడ్‌ బి.పాల్‌, జియాన్‌ ఫ్రాంకో డి సిక్కో, సీన్‌ హెంచ్‌బెర్గర్‌, రిచర్డ్‌ డొనెల్లీ, సీఈ నరసింహమూర్తి, పీపీఏ సభ్య కార్యదర్శి ఎం.రఘురాం, కేంద్ర జలసంఘం అధికారులు సరబ్‌ జిత్‌ సింగ్‌ భక్షి, అశ్వనీకుమార్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 04:55 AM