ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Dr Ram Kumar Kakani: భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చాలి

ABN, Publish Date - Aug 04 , 2025 | 05:14 AM

భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం.., సమ్మిళిత, స్థిరమైన వృద్ధిని నిర్ధారించడం వంటి

  • ఐఐఎం రాయ్‌పూర్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రామ్‌ కుమార్‌ కాకాని

గుంటూరు (విద్య) ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి ): భారతదేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడం.., సమ్మిళిత, స్థిరమైన వృద్ధిని నిర్ధారించడం వంటి లక్ష్యాలు మన మందున్నాయని ఐఐఎం రాయ్‌పూర్‌ మాజీ డైరెక్టర్‌ డాక్టర్‌ రామ్‌ కుమార్‌ కాకాని అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఆదివారం 3వ స్నాతకోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్‌ రామ్‌ కుమార్‌ కాకాని మాట్లాడుతూ, మెరుగైన సమాజ నిర్మాణం కోసం మనిషి 105 సంవత్సరాల జీవితకాలానికి సరిపోయేట్లుగా ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. విద్యార్థులు నేటి సోషల్‌ ప్రపంచంలో మునిగిపోకుండా వ్యక్తిగత ప్రపంచం, వృత్తిపరమైన ప్రపంచానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. విజ్ఞాన్స్‌ వర్సీటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ. నాగభూషణ్‌ మాట్లాడుతూ, తమ యూనివర్సిటీ 1191 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసిందని తెలిపారు. వీరిలో బీబీఏ 39 మంది, బీసీఏ 31 , ఎంబీఏ 689, ఎంసీఏ 397, పాటిటెక్నిక్‌ ఎడ్యుకేషన్‌ 35 మందికి అందించామని వెల్లడించారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రసంగిస్తూ విద్యార్థులు ముందుగా సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించాలని, ఆ సమస్యల పరిష్కారానికి నూతన ప్రాజెక్టులను చేపట్టి సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఈవో డాక్టర్‌ మేఘన కూరపాటి, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు, విజయవాడలోని ఆర్‌ఆర్‌ స్పోర్ట్స్‌ ఫౌండర్‌ గల్లా రాధా రాణి తదితరులు పాల్గొన్నారు.

చివరి సి-295 భారత్‌కు చేరింది.. అప్పగింతలు పూర్తి చేసిన స్పెయిన్

తేజస్వి యాదవ్‌కు ఎన్నికల కమిషన్ నోటీసు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 04 , 2025 | 05:14 AM