Rains: నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..
ABN, Publish Date - May 30 , 2025 | 07:49 AM
మే చివరి వారం రోహిణి కార్తీ. దీంతో బాగా ఎండలు కాయాల్సి ఉంది. కానీ నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మే చివరి మాసంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడి.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటింది. ఇది రానున్న 12 గంటల్లో మరింత బలహీన పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారినందున కోస్తా ప్రాంతంలోని మత్స్యకారులు ఎవరూ చేపల వేటకు వెళ్లరాదని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇక వాయుగుండం, నైరుతి రుతుపవనాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లాల్లో వర్షాలు కురుస్తాయిని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కోస్తాంధ్రలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు.. రాయలసీమలో నంద్యాల, వైఎస్ఆర్ కడప, తిరుపతి జిల్లాల్లో తెలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. అలాగే మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడతాయని వివరించింది.
ఇక తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో జూన్ 2వ తేదీ వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు పేర్కొంది. గురువారం కొత్తగూడెం జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవగా.. మహబూబాబాద్, సిరిసిల్ల, ఆదిలాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి ప్రధాన రహదారులు జలమయమైనాయి.
అసలు అయితే మే చివరి వారం రోహిణి కార్తీ. దీంతో బాగా ఎండలు కాయాల్సి ఉంది. కానీ నైరుతి రుతుపవనాలు ముందే వచ్చేశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మే చివరి మాసంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 30 , 2025 | 08:18 AM