ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vijay Kumar ACB Investigation: హైకోర్టు మొట్టికాయలతో ఏసీబీ ముందుకు విజయ్

ABN, Publish Date - Apr 02 , 2025 | 01:30 PM

Vijay Kumar ACB Investigation: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేసిన విజయ్ కుమార్ ఏసీబీ ముందు విచారణకు హాజరయ్యారు.

Vijay Kumar ACB Investigation:

గుంటూరు, ఏప్రిల్ 2: జిల్లా ఏసీబీ (ACB) ఆఫీస్‌కు మాజీ సమాచార కమిషనర్ విజయ్ కుమార్ విచారణకు హాజరయ్యారు. విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలని ఇటీవలే విజయ్‌ కుమార్‌ను హైకోర్టు (AP High Court) ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఏసీబీ ఆఫీసుకు విజయ్‌ కుమార్ వచ్చారు. గత ప్రభుత్వంలో సమాచార శాఖ ద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీలో నమోదైన కేసుకు సంబంధించి ఈరోజు (బుధవారం) అప్పటి సమాచార కమిషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు.


ఇప్పటికే కమషనర్‌గా పనిచేసిన విజయ్‌ కుమార్‌పై కేసు నమోదు చేసినప్పటికీ ఆయన విచారణకు రాకపోవడంతో ఇటీవలే హైకోర్టు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్ ఇచ్చినప్పటికీ విచారణకు సహకరించాలని చెప్పామని, తప్పనిసరిగా విచారణకు హాజరుకావాల్సిందే అంటూ కొద్దిరోజుల క్రితం హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈరోజు విజయ్‌కుమార్ ఏసీబీ ముందు విచారణకు వచ్చారు.


గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సమాచార శాఖ కమిషనర్‌గా పనిచేసిన విజయ్ కుమార్.. సాక్షి దినపత్రిక, సాక్షి మీడియాకు అడ్డగోలుగా ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టారని.. సాక్షి సిబ్బందికి కూడా ప్రభుత్వం నుంచి జీతాలు ఇచ్చారంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు అయ్యింది. 2019 నుంచి 2024 వరకూ జరిగిన ఈ బాగోతంలో మొత్తం రూ.859 కోట్ల మేర ప్రభుత్వ ధనం విజయ్‌ కుమార్‌ చేతుల మీదుగా ఖర్చు చేశారు. ఇందులో సగానికి పైగా సాక్షి పత్రికకు అందించారన్న అభియోగాలపై గతేడాది నవంబరు 14న విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. అంతేకాకుండా మార్చి 18న విచారణకు రావాల్సిందిగా విజయ్ కుమార్‌కు నోటీసులు ఇవ్వగా... తీరిక చూసుకుని వస్తానంటూ సమాధానమిచ్చారు. ఆ వెంటనే ముందస్తు బెయిల్ కోసం విజయ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో విజయ్‌ కుమార్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈరోజు (ఏప్రిల్ 2) విచారణకు హాజరుకావాలని.. కేసు ప్రస్తుత దశలో ఉన్నందున అరెస్ట్ చేయబోమంటూ నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఏసీబీ విచారణకు హాజరుకావాల్సిందే అంటూ హైకోర్టు కూడా స్పష్టం చేసింది. అలాగే ముందస్తు బెయిల్‌పై విచారణను ఏప్రిల్ మూడో వారానికి హైకోర్టు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

Rice: సన్నబియ్యం కోసం సందెవేళలోనూ..

Ameenpur Case Twist: అమీన్‌పూర్‌ కేసులో ట్విస్ట్.. బయటపడ్డ కన్నతల్లి బాగోతం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 01:30 PM