ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: చంద్రబాబుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే.. మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం

ABN, Publish Date - Feb 27 , 2025 | 09:12 PM

CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి సాయం చేస్తూ బాసటగా నిలుస్తున్నారు. తన దృష్టికి వస్తున్న సమస్యలపై త్వరిత గతిన స్పందిస్తూ శెభాష్ అనిపించుకుంటున్నారు. ప్రజా సమస్యలపై చంద్రబాబు స్పందిస్తున్న తీరుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ యువతికి తాను అండగా ఉన్నానంటూ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

CM Nara Chandrababu Naidu

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి మంచి మానవత్వం చాటుకున్నారు. వివాహానికి సాయం కోరిన అంధ యువతికి ముఖ్యమంత్రి రూ.5 లక్షల ఆర్థికసాయం అందజేశారు. అంధురాలు అయినప్పటికీ ఆత్మస్థైర్యం, పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎంఏ వరకూ యువతి చదువుకుంది. ఆమె అంధురాలు కావడం, కుటుంబం ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉండటంతో యువతికి వివాహమవ్వడం భారంగా మారింది.


ఆ కుటుంబ ధీన పరిస్థితిని అర్థం చేసుకుని శాంతిపురం మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన భూపతి అనే యువకుడు నాగమణిని వివాహం చేసుకోవడానికి ముందుకువచ్చాడు. ఇటీవల నాగమణి ముఖ్యమంత్రిని భూపతితో కలిసి వచ్చి తన వివాహానికి ఆర్థిక సాయం చేయాలని కోరింది. స్పందించిన సీఎం చంద్రబాబు వివాహ ఖర్చుల నిమిత్తం రూ.5 లక్షలు ప్రకటించారు. బుధవారం సీఎం చంద్రబాబును కలిసి యువతి చెక్కు తీసుకుంది. నాగమణిని వివాహం చేసుకుని తోడ్పాటుగా ఉండేందుకు ముందుకువచ్చిన భూపతిని సీఎం చంద్రబాబు అభినందించారు. కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. భయపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటానని యువతికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు. చంద్రబాబు ఆప్యాయతతో పలకరించడంతో అంధ యువతి ఎంతో సంతోషం వ్యక్తం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి

Posani Arrest: చట్టబద్ధంగానే వైసీపీ నేత పోసాని కృష్ణమురళీ అరెస్ట్: మంత్రి కొల్లు రవీంద్ర

CM Chandrababu: వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ.. ఫోటోలు దిగిన చంద్రబాబు..

Posani Arrest: ఆ పోలీస్ స్టేషన్‌కు పోసాని.. ఎందుకంటే..

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 27 , 2025 | 09:20 PM