ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Ramanaidu: ఇరిగేషన్ పనుల్లో జాప్యం చేయొద్దు

ABN, Publish Date - May 12 , 2025 | 02:02 PM

Minister Nimmala Ramanaidu: ఇరిగేషన్ పనుల్లో అధికారులు జాప్యం చేయొద్దని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. సాగు నీటి సంఘాలు ఆధ్వ‌ర్యంలో, వారి ప‌రిధిలోని ప‌నుల‌ను, మే నెలాఖ‌రుకు పూర్తిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.

Minister Nimmala Ramanaidu

విజయవాడ:ఇరిగేష‌న్ ప‌నులు, నిర్వహణ, మ‌ర‌మ్మ‌త్తుల కోసం రూ. 344 కోట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) తెలిపారు. అవ‌స‌ర‌మైన చోట్ల 7 రోజుల వ్య‌వ‌ధితో షార్ట్ టెండ‌ర్లను పిల‌వ‌డానికి ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిందని అన్నారు. ఇవాళ(సోమవారం) ఓ అండ్ ఎం పనులపై ఇరిగేషన్ అధికారులతో, మంత్రి నిమ్మల రామానాయుడు టెలీకాన్ఫ‌రెన్స్ నిర్వహించారు. ఈ సమావేశానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, క‌డా క‌మిష‌న‌ర్ రాంసుంద‌ర్ రెడ్డి, ఈఎన్సీ వెంకటేశ్వరావు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీఈలు, ఎస్ఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు. సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్వ‌హ‌ణ, మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను చేప‌ట్టడమే తమ ప్రభుత్వ ప్ర‌ధాన ల‌క్ష్యమని అన్నారు. 2025 ఖ‌రీఫ్ ప్రారంభానికి ముందు నీటిపారుద‌ల వ్య‌వ‌స్థల‌ను సాధార‌ణ స్దితికి తీసుకురావాలని ఆదేశించారు. గేట్లు, ష‌ట్ట‌ర్లు, వంటి మెకానిక‌ల్ ప‌నుల‌ను త‌ప్ప‌నిస‌రిగా అసిస్టెంట్ ఇంజ‌నీర్ ప‌రిశీలించి, స‌క్ర‌మంగా ప‌నిచేసే స్దితిలో ఉన్నాయ‌నే ధ్రువీక‌ర‌ణ ప‌త్రాన్ని, చీఫ్ ఇంజ‌నీర్‌కు ఇవ్వాలని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.


సాగు నీటి సంఘాలు ఆధ్వ‌ర్యంలో, వారి ప‌రిధిలోని ప‌నుల‌ను, మే నెలాఖ‌రుకు పూర్తిచేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప‌నుల‌ను స‌కాలంలో పూర్తిచేయ‌డానికి చీఫ్ ఇంజ‌నీర్లు, సూప‌రింటెండెంట్ ఇంజ‌నీర్లు నిరంత‌రంగా ప‌ర్య‌వేక్ష‌ణ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి ప‌రిస్దితుల్లోనూ అన్ని ప‌నులూ, సీజ‌న్ మొద‌లయ్యే నాటికి పూర్తి చేయాలని అధికారుల‌కు ఆదేశించారు. గతంలో మాదిరిగా కాకుండా మే చివరి నాటికి, అన్ని అత్యవసర పనులు, నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు నిర్దేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

India- Pakistan War: రెండు దేశాల మధ్య కీలక చర్చలు

టిబెట్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.7 తీవ్రత

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 13మంది మృతి

ED Summons: సినీ నటుడు మహేష్ బాబుకు మరోసారి ఈడీ నోటీసులు..

For More AP News and Telugu News

Updated Date - May 12 , 2025 | 03:11 PM