ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Minister Anagani Satya: ఫ్రీహోల్డ్‌ భూముల్లో పేదలకు న్యాయం

ABN, Publish Date - Jun 07 , 2025 | 04:32 AM

రాష్ట్రంలో ఫ్రీహోల్డ్‌ భూములపై పేదలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని టీడీపీ కార్యాలయంలో...

  • గంజాయి బ్యాచ్‌ను జగన్‌ పరామర్శించడం సిగ్గుచేటు: మంత్రి అనగాని

రేపల్ల్లె, జూన్‌ 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఫ్రీహోల్డ్‌ భూములపై పేదలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తెలిపారు. బాపట్ల జిల్లా రేపల్లెలోని టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 22 ఏ భూములకు సంబంధించి కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రజల ఆస్థులకు రక్షణ కల్పించేలా రెవెన్యూ సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. జగన్‌ పాలనలో రెవెన్యూ వ్యవస్థను భ్రష్ఠుపట్టించారన్నారు. తెనాలిలో గంజాయి బ్యాచ్‌ను పరామర్శించడానికి జగన్‌ రావడం సిగ్గుచేటన్నారు. వైసీపీ పాలనలో రేపల్లె ప్రాంతానికి చెందిన అమర్‌నాథ్‌ గౌడ్‌ను అమానుషంగా చంపితే కనీసం పట్టించుకోలేదన్నారు. ఇలాంటి నాయకులు నీతులు చెబితే ప్రజలు నమ్మేపరిస్థితి లేదన్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రోజురోజుకి జగన్‌రెడ్డి మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - Jun 07 , 2025 | 04:34 AM