Vallabhaneni Vamsi: వంశీపై 2019 ఎన్నికల కేసు.. ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరు
ABN, Publish Date - May 13 , 2025 | 05:19 AM
టీడీపీ కార్యకర్త ముదునూరి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోర్టులో హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో పోలింగ్ బూత్ రిగ్గింగ్ కారణంగా వంశీపై మూడు కేసులు నమోదయ్యాయి, కోర్టు విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.
టీడీపీ కార్యకర్త ముదునూరి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు సోమవారం ప్రజాప్రతినిధుల కేసుల విచారణ కోర్టులో హాజరుపరిచారు. 2019, ఎన్నికల సమయంలో వంశీ టీడీపీ తరఫున పోటీ చేశారు. ఆ సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.. ప్రసాదంపాడులోని పోలింగ్ బూత్‌లో రిగ్గింగ్ జరుగుతోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న వంశీ, ఆయన అనుచరులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీనిపై పటమట పోలీసులు కేసులు నమోదు చేశారు. వంశీపై నమోదైన మూడు కేసుల్లోను పీటీ వారెంట్‌పై కోర్టులో హాజరుపరిచారు. కోర్టు తదుపరి విచారణను జూన్ 3కి వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For AndhraPradesh News And Telugu News
Updated Date - May 13 , 2025 | 05:19 AM