ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Andhra Pradesh government: ఏపీ భవనాల రూల్స్‌ సవరణపై తుది నోటిఫికేషన్‌

ABN, Publish Date - Jun 27 , 2025 | 04:52 AM

ఆంధ్రప్రదేశ్‌ భవనాల రూల్స్‌ 2017కు సవరణలపై మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ తుది నోటిఫికేషన్‌ జీవో 114 జారీచేసింది.

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ భవనాల రూల్స్‌-2017కు సవరణలపై మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ తుది నోటిఫికేషన్‌ (జీవో .114) జారీచేసింది. భవన, లేఅవుట్ల అనుమతుల జారీ నిబంధనల్లో సవరణలకు రాష్ట్ర క్యాబినెట్‌ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో తుది నోటిఫికేషన్‌ విడుదల చేసింది. చిన్న భవనాలకు అనుమతుల విషయంలో వెసులుబాటు కల్పించారు. 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే జీ, జీప్లస్‌ భవనాలకు కేవలం ఒక్క రూపాయి ఫీజు చెల్లించి అనుమతి తీసుకోవచ్చు. అన్ని రకాల భవనాలు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లు, హోటల్స్‌, గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లకు సీసీ టీవీలను తప్పనిసరి చేశారు. ఇంకా ప్లాట్ల సెట్‌ బ్యాక్‌ ఏరియా విషయంలోనూ పలు వెసులుబాట్లు కల్పించారు.

గ్రామీణ ప్రాంతాల్లో 7 అన్న క్యాంటీన్లు

పట్టణాభివృద్ధి అథారిటీ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో రూ.4.47 కోట్లతో ఏడు అన్న క్యాంటీన్లు మంజూరు చేస్తూ మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అథారిటీ పరిధి లో కోటబొమ్మాళి, దుగ్గిరాల, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం, కుప్పం (రూరల్‌), ఉప్పాడ కొత్తపల్లి ఉన్నాయి.

Updated Date - Jun 27 , 2025 | 04:52 AM