Andhra Pradesh: ధాన్యం బకాయిల కోసం రైతుల ధర్నా
ABN, Publish Date - Jul 01 , 2025 | 06:22 AM
రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు.
వారంలో చెల్లిస్తామంటూ అధికారుల హామీ
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో సోమవారం విజయవాడలోని పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం సివిల్ సప్లయిస్ కమిషనర్ సౌరభ్ గౌర్, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ఎండీ మనజీర్ జిలానీ సమూన్‌లను కలసి వినతిపత్రాలు అందజేశారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని రైతు సంఘాల ప్రతినిధులు తెలిపారు.
Updated Date - Jul 01 , 2025 | 06:23 AM