ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Road Accident: రోడ్డుప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

ABN, Publish Date - May 26 , 2025 | 11:42 AM

రాజమహేంద్రవరంలోని గామాన్ బ్రిడ్జ్‌ వద్ద ఆటోనగర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది.

Road Accident

రాజమహేంద్రవరం, మే 26: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గామాన్ బ్రిడ్జ్ వద్ద ఆటోనగర్ సమీపంలో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం వైపు వెళ్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా స్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించగా.. ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు.


అయితే గాయపడిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరోవైపు మృతదేహాలను సైతం పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు మండలం పశివేదల గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు పోలీసులు చెప్పారు. సోమవారం తెల్లవారుజామున పశివేదల నుంచి కాకినాడకు వీరంతా కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. లారీ డ్రైవర్‌తోపాటు క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వివరించారు. కాగా, మృతులంతా చాగల్లు మండలం దారవరం, మార్కండేయపాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. లారీ టైర్ గాలి ఒక్కసారిగా తగ్గి కారును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..
అతడికి ఏదో అయ్యింది.. పిచ్చివాడిగా మారాడు..

దారుణం.. తొమ్మిది మంది అన్నాచెల్లెళ్లు మృతి..

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 26 , 2025 | 12:42 PM