ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Medico Student: కాకినాడ జిల్లాలో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య

ABN, Publish Date - Feb 11 , 2025 | 11:05 AM

Medico Student:ఈ మధ్యకాలంలో రోజుకోక దారుణమైన సంఘటన వెలుగు చూస్తోంది. కొంతమంది యువత కారణాలు ఏమైనప్పటికీ ప్రతీసమస్యకూ ఆత్మహత్యే సరైన పరిష్కారం అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఓ యువ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డాక్టర్ అవుతాడని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీవ్ర నిరాశ మిగిల్చాడు. విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. దర్యాప్తు చేస్తున్నారు.

కాకినాడ జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థి కాలేజీ హాస్టల్ గదిలో విగత జీవిగా కనిపించాడు. గదిలో తలుపులు వేసుకున్న విద్యార్ధి.. ఎంతకూ తలుపులు తీయకపోవడంతో తోటి విద్యార్థులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. మెడికల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే తోటి విద్యార్థులు హాస్టల్‌ సిబ్బందికి, తండ్రికి సమాచారం అందించారు. పోలీసులకు సమాచారం తెలియడంతో ఘటనాస్థలికి చేరుకుని విద్యార్థి మృతదేహాన్ని కిందకు దించారు. తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.


వివరాల్లోకి వెళ్తే.. కాకినాడ జిల్లాలోని రంగరాయ మెడికల్ కాలేజ్‌లో సోమవారం రాత్రి ఒంటిగంట సమయంలో ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్‌లో రావూరు సాయిరాం(22) ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిరాం ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఫ్యాన్‌కు వేలాడుతూ యువకుడు కనిపించాడు. ఇది గమనించిన విద్యార్థులు తక్షణమే కాలేజీ సిబ్బందికి తెలియజేసి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తీసుకువెళ్లారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి మృతిచెందినట్లు ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అసలు విద్యార్థి ఎందుకు హ్యాంగింగ్ చేసుకున్నారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

4 దశాబ్దాల తర్వాత గ్రామస్థులంతా కలిసి భోజనాలు

ఆ యాక్టు మార్చే ఆలోచన లేదు

ఏపీ మంత్రుల నెత్తిన ర్యాంకుల పిడుగు

మంత్రి పయ్యావుల ప్రీ-బడ్జెటరీ సమావేశాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 11 , 2025 | 12:09 PM