ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Parcel explosion: ఆటోలో నుంచి పార్శిల్‌ను దించుతుండగా అనుకోని ఘటన..

ABN, Publish Date - Mar 03 , 2025 | 11:57 AM

Parcel explosion: కాకినాడలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. వార్పు రోడ్డులో బాలాజీ ట్రాన్స్‌పోర్టు షాపులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పార్శిల్‌ను దించుతుండగా...

Parcel explosion

కాకినాడ, మార్చి 3: నగరంలోని వార్పు రోడ్డులో బాలాజీ ట్రాన్స్‌పోర్టు షాపులో (Transport shop) పేలుడు సంభవించింది. హైదారాబాద్ నుంచి వచ్చిన ఓ పార్శిల్‌ను (parcel Explosion) దించుతుండగా ఒక్కసారిగా పేలింది. ఈ ప్రమాదంలో అక్కడే ఉన్న కూలీల్లో ఐదుగురికి గాయాలవగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. పార్శిల్‌‌లో ఏముంది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తానికి పార్శిల్‌లో ఏ ముంది.. ఎందుకు పేలుడు జరిగింది అనే దానిని పోలీసులు గుర్తించారు.


ఈరోజు (సోమవారం) ఉదయం బాలాజీ ట్రాన్స్‌పోర్టు కంపెనీలో అగ్ని్ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన పార్శిల్ లోడ్‌ను పలువురు కూలీలు ఆటోలో నుంచి కిందకు దించుతున్నారు. ఈ క్రమంలో ఓ కార్మికుడు పెద్ద పార్శిల్‌ను లారీ నుంచి తీసి భుజాన వేసుకుని కిందకు దించుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే పలువురు కూలీలు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్శిల్ దించుతున్న కూలీకి మాత్రం కాళ్లు, చేతులు పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కాకినాడ జీజీహెచ్‌‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి పార్శిల్ వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

Gold Rates Today: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..


అయితే పార్శిల్‌ను దించిన వెంటనే పేలుడు సంభవించడానికి కారణం ఏంటి అనేదానిపై ఆరా తీయగా... అందులో చిన్న పిల్లలు కాల్చే టపాసులు ఉన్నట్లు గుర్తించారు. చిన్న పిల్లలు గోడకేసి కొట్టగా పేలే టపాసులు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిబంధనల ప్రకారం పేలుడు పదార్థాలు ఉన్న పార్శిల్‌ను అనుమతించడం నేరం. అయినప్పటికీ కూడా ఇలాంటి నిబంధనలు పట్టించుకోకుండా ట్రాన్స్‌పోర్టు కంపెనీలు ఏ విధంగా హైదరాబాద్‌ నుంచి ఇక్కడకు తరలించారు అనేదానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అలాగే హైదరాబాద్ నుంచి ఈ పార్శిల్‌ను ఎవరు పంపించారు.. ఆ కంపెనీ ఏంటి అనే దానిపై కూడా పూర్తిగా ఆరా తీస్తున్నారు. అయితే వేసవి నేపథ్యంలో ఇలాంటి పార్శిల్‌లు వేస్తే కచ్చితంగా ప్రమాదాలు సంభవిస్తాయని, ట్రాన్స్‌పోర్టు కంపెనీలు అజాగ్రత్తగా ప్రవర్తించడం ఏమాత్రం మంచి పద్దతి కాదని పోలీసులు హెచ్చరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి...

Case on Posani Murali Krishna: పోసానిపై కేసు.. రాజంపేటకు నరసారావుపేట పోలీసులు

Toddy Cat spotted: కృష్ణా జిల్లాలో అరుదైన జాతి పునుగుపిల్లి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 03 , 2025 | 01:54 PM