Gold Rates Today: నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 03 , 2025 | 09:13 AM
పసిడిని కొనుగోలు చేయాలనుకునే వారు బంగారం ధరల్లో మార్పులపై ఓ కన్నేసి ఉంచాలి. మరి తాజా ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఎటువంటి పరిస్థితుల్లోనైనా సురక్షితమైన పెట్టుబడి సాధనం బంగారం. ఇక భారతీయ సంప్రదాయంలో బంగారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరి పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారు, శుభకార్యాలకు కొనుగోలు చేయాలనుకునే వారు పసిడి ధరలపై నిత్యం ఓ కన్నేసి ఉంచాలి. ఇటీవల కాలంలో బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ.84,460గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ.94,270. బంగారం ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో పెట్టుబడికి ఇదే సరైన సమయం అని మార్కెట్ వర్గాలు భావిస్తు్న్నాయి (Gold Rates Today In India).
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు (24కే, 22కే)
న్యూఢిల్లీ: రూ.84,170; రూ.77,156
ముంబై: రూ.84,310; రూ.77,284
కోల్‌కతా: రూ.84,200; రూ.77,183
చెన్నై: రూ.84,560; రూ.77,513
హైదరాబాద్: రూ.84,440; రూ.77,403
బెంగళూరు: రూ.84,380; రూ.77,348
అహ్మదాబాద్: రూ.84,420; రూ.77,385
ఇదిలా ఉంటే, ట్రంప్ సుంకాల విధింపు భయాలు, అనిశ్చిత భౌగోళికరాజకీయ పరిస్థితులు కారణంగా ఈ ఏడాది బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది అంతర్జాతీయంగా ఆనిశ్చితి మరింత పెరిగితే బంగారం ధర రూ.లక్ష మార్కు దాటినా ఆశ్చర్యపోవక్కర్లేదని అంటున్నాయి. అయితే, బంగారం మార్కెట్ ధరలతో నిమిత్తం లేకుండా సాధారణ పెట్టుబడి దారులు కేవలం బంగారంపైనే ఆశలు పెట్టుకోకుండా తమ నిధులు వివిధ సాధనాల్లోకి మళ్లించడమే మంచిదని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.