Digital India: భూ రికార్డుల డిజిటలైజేషన్‌లో ఏపీ భేష్
ABN, Publish Date - May 17 , 2025 | 04:22 AM
భారత అభివృద్ధికి ఆధునిక సాంకేతికత అవసరమని మంత్రి పెమ్మసాని అన్నారు. భూ రికార్డుల డిజిటలైజేషన్‌లో ఏపీ ముందంజలో ఉందని, నక్షా ప్రాజెక్టు ద్వారా పట్టణ భూ వివాదాలు తగ్గుతాయని రాష్ట్ర మంత్రి నారాయణ తెలిపారు.
ప్రోత్సాహక నిధుల్లో రాష్ట్రానికి సింహభాగం: కేంద్రమంత్రి పెమ్మసాని
గడువులోగా 10 మున్సిపాలిటీల్లో డిజిటలైజేషన్: మంత్రి నారాయణ
గుంటూరు, మే 16(ఆంధ్రజ్యోతి): ఆధునిక సాంకేతిక విధానాలతోనే భారతదేశ అభివృద్ధి, ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌తో సహా ఏడు రాష్ర్టాలు భూసర్వే డిజిటలైజేషన్‌లో ముందంజలో ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రోత్సాహక నిధుల్లో సింహభాగాన్ని దక్కించుకుందన్నారు. తొలి దశలో 15 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రణాళికలో భాగంగా 3 లక్షల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పూర్తి చేశామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి కచ్చితమైన భూ రికార్డులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. గుంటూరులో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, భూ వనరుల విభాగం ఆధ్వర్యంలో డిజిటల్ ఇండియా భూ రికార్డుల ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా సర్వే, రీసర్వేపై రెండు రోజుల జాతీయ వర్క్‌షాప్ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని, రాష్ట్రమంత్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి పి నారాయణ మాట్లాడుతూ, పట్టణాల్లో రెవెన్యూ రికార్డులు పక్కాగా అమలు చేయడానికి, భూ వివాదాలకు చెక్ పెట్టేందుకు నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యబిటేషన్స్(నక్షా) కార్యక్రమాన్ని కేంద్రం తీసుకువచ్చిందన్నారు. సమర్థ పాలన అందించేందుకు నక్షా ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. నక్షా పైలట్ ప్రోగ్రామ్ ద్వారా రాష్ట్రంలోని 10 మునిసిపాలిటీల్లో 524 చ.కి.మీ. విస్తీర్ణంలో 9.5 లక్షల ఆస్తులను నిర్దేశిత గడువులోగా సర్వే చేసి డిజిటలైజేషన్ చేయనున్నామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్
Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం
Liquor Scam Arrests: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ
Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు
For More AP News and Telugu News
Updated Date - May 17 , 2025 | 04:22 AM