ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

YS Jaganmohan Reddy: జగన్‌ షాడో..

ABN, Publish Date - May 17 , 2025 | 03:37 AM

జగన్ ప్రభుత్వంలో ధనుంజయ్ రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేసి పాలనపై పూర్తి నియంత్రణ తెచ్చుకున్నారని ఆరోపణలు వెలుగుచూశాయి. సీఎంను కలవాలంటే కూడా ఆయన అనుమతే అవసరమయ్యిందని మాజీ నేతలు మండిపడుతున్నారు.

మీటింగ్స్‌, డీలింగ్స్‌లో ధనుంజయ్‌ దిట్ట

సర్వాంతర్యామిలా ఎదిగిన అధికారి

ఐదేళ్లూ పాలనపై పెత్తనం ఆయనదే

జగన్‌ సొంత పనుల పర్యవేక్షణ

పోస్టింగుల్లో అస్మదీయులకే అందలం

ప్రశ్నించేవారికి వెయిటింగే

అధికారిగా ఉంటూ

వైసీపీకి రాజకీయ సేవలు

వైసీపీ ఎమ్మెల్యేల నుంచే ఆరోపణలు

ఆ కుటుంబంలో ఒకడిగా కృష్ణమోహన్‌రెడ్డి

మద్యం ముడుపుల గుట్టు ఆయనకే ఎరుక!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డే ప్రత్యేక మైన మనిషి. పదవీకాంక్ష, సొంత ప్రయోజనాలు, స్వలాభం, స్వీయ రాజకీయ లబ్ధి ఉంటే తప్ప దేనిగురించీ ఆలోచించని వ్యక్తి. ఒక్క చాన్స్‌ అన్నందుకు ఐదేళ్లు రాష్ట్రానికి ఎంత నరకం చూపించారో అందరికీ తెలుసు. ఆ కోవలోని మరో మనిషే ధనుంజయ్‌రెడ్డి. ఉమ్మడి కడప జిల్లాకే చెందిన ఈ రిటైర్డ్‌ ఐఏఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు కార్యదర్శిగా పనిచేశారు. జగన్‌కు ఫక్తుషాడోగా వ్యవహరించారు. రాజకీయ సేవ, పాలనా సేవలో సర్వాంతర్యామిలా ఎదిగారు. ఆయన వేలుపెట్టని రంగం లేదు. ఆయన అనుమతి లేకుండా చీమ కూడా సీఎంవోలోకి వెళ్లలేనంతగా తన హోదాను పెంచుకున్నారు. ఆ కింగ్‌పిన్‌ ఇప్పుడు దొరకడంతో లిక్కర్‌తో పాటు అనేక కొత్త విషయాలు బయటపడొచ్చని చర్చోపచర్యలు సాగుతున్నాయి.

జగన్‌ కోసం...

ధనుంజయరెడ్డి 2019లో జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక తొలుత అదపు కార్యదర్శిగా చేరారు. ఆ తర్వాత కార్యదర్శిగా పనిచేశారు. అప్పుడే ఆయన అసలు విశ్వరూపం బయటపడింది. కడప జిల్లాకే సంబంధించి ఎంతోమంది అధికారులు, జగన్‌ సామాజికవర్గానికి చెందిన వారు ఎందరో ఉన్నా ఏరికోరి ఈయననే ఎందుకు తన పేషీలోకి తొలుత తీసుకున్నారని అంతా షాక్‌ అయ్యారు. ఆ తర్వాతే అసలు కారణాలు తెలిశాయి. జగన్‌లాగే ఆలోచించడం, మీటింగ్స్‌, డీలింగ్స్‌తోపాటు తక్కువ సమయంలో ఎక్కువ వ్యవహారాలు చక్కబెట్టడంలో ఈయనకు మంచి రికార్డు ఉందని, అందుకే పేషీలోకి తీసుకున్నారని అదేజిల్లాకు చెందిన ఓ సీనియర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ చెప్పారు. గ్రూపు, వర్గరాజకీయాలు, వ్యూహాలు నడపడంలో ఆయన దిట్ట అని వివరించారు. ఆచరణలోనూ అదే నిరూపితమైంది. జగన్‌ పేషీలో ఉంటూ మొదటి రెండేళ్లు అంటే, 2019, 2020లో జగన్‌ ఆలోచనావిధానం అర్థం చేసుకున్నారనీ, ఆ తర్వాత ఆయన షాడోగా మారారని అధికారులు చెబుతున్నారు. పరిపాలనా బాధ్యతల కన్నా జగన్‌ సొంత వ్యవహారాలను చక్కదిద్దడంపైనే దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. ఇసుక, మద్యం, కాంట్రాక్ట్‌లు, ఇతర కీలకమైన వాటిల్లో ధనుంజయ్‌రెడ్డికే జగన్‌ నిర్ణయాధికారాలు ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.


సర్వాంతర్యామిలా...

జగన్‌కు కార్యదర్శిగా ప్రభుత్వ వ్యవహారాల్లో చేదోడుగా ఉండాల్సిన అధికారి కాలక్రమేణా మాజీ సీఎం సొంత వ్యవహారాలపై ఫోక్‌సపెట్టేలా ఎదిగారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ధనుంజయ్‌రెడ్డి తనకిచ్చిన పనుల ఫలితాలను అద్భుతంగా చూపించాక ఈయనపైనే ఎక్కువ ఆధారపడేలా చేసుకున్నారని ఓ కీలక వైసీపీనేత చెబుతున్నారు. నిఘా నివేదికలు నేరుగా సీఎం చూడాలి. కానీ ఒక దశలో ఆ నివేదికలు కార్యదర్శికి వెళ్లేవని, వాటి ఆధారంగా ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు క్లాసులు తీసుకొనే వారని తెలిసింది. ఇద్దరు సీనియర్‌ మంత్రులు మినహా మిగతా మంత్రులు ఈయన నుంచి ఫోన్‌ అంటేనే హడలెత్తిపోయేవారని తెలిసింది. ఇక కొత్త ఎమ్మెల్యేల పరిస్థితి భయానకంగా ఉండేదని సీనియర్‌ నేత చెప్పారు. ఎమ్మెల్యేలు సీఎంను కలవాలంటే ముందు ధనుంజయ్‌ అనుమతి తీసుకోవాలని చెప్పేవారని, ఆయన అపాయింట్‌మెంట్‌ దక్కడమే గగనంగా ఉండేదని ఆ నేత పేర్కొన్నారు.


గుప్పిట్లో పాలనా వ్యవస్థ..

నాటి సీఎం జగన్‌కు పాలనా వ్యవస్థ గురించి అనుభవం లేదు. పట్టులేదు. పట్టంతా ధనుంజయ్‌రెడ్డిదే. అధికారుల పోస్టింగ్‌లు, బదిలీలు, క్రమశిక్షణా చర్యలు....ఇలా అన్నింటా ఆయనదే నిర్ణయాధికారంగా ఉండేదని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. తన సామాజికవర్గానికి చెందిన అధికారులతో ప్రత్యేక కోటరీ నడిపేవారని, తనకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేవారికి పిలిచి మరీ కీలక పోస్టింగ్‌లు ఇచ్చేవారని చెబుతున్నారు. తనను ప్రశ్నించేవారు సొంత సామాజికవర్గమయినా వారికి పోస్టింగ్‌లు ఉండేవి కావని, వెయింటింగ్‌లో ఉంచేవారని బాధిత అధికారులు చెబుతున్నారు. ’’సిస్టంతో పెట్టుకోవద్దు. సిస్టంలో మీరు ఉండాలా? వద్దా? అనేది మేం డిసైడ్‌చేస్తాం. మాజీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ఏం జరిగిందో చూశారు కదా...మేం ఇచ్చిన పోస్టులో చేరండి. చెప్పిన పనిచేయండి.’’ అని అధికారులను తీవ్రంగా మందలించడం, బెదిరించడం చేశారని ఓ బాధిత అధికారి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. తనను ప్రశ్నిస్తే సీనియర్‌ అధికారులను కూడా అమర్యాదగా, అగౌరవంగా ధనుంజయ్‌రెడ్డి చూసేవారని వాపోయారు. ’’గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసిన ఓ అధికారి ధనుంజయ్‌కి స్నేహితుడు. జగన్‌ పాలనలో ఆయనకు ఎనిమిది శాఖలు ఇచ్చారు. అర్హత లేకపోయినా అందలం ఎక్కించారు. ఓ స్పెషల్‌ సీఎస్‌ కేడర్‌ అధికారి మాట వినడం లేదని రెవెన్యూశాఖ నుంచి తప్పించారు. సెలవుపై వెళ్తే, సీసీఎల్‌ఏ పోస్టును కూడా తీసేయ్యాలని చూశారు’’ అని ఓ సీనియర్‌ ఐఏఎస్‌ చెప్పారు. నాణానికి ఇది ఒక కోణం. రెండోకోణంలో ఆయన వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించారన్న ఆరోపణలు ఉన్నాయి. నిఘా విభాగం, ఐప్యాక్‌ ఇచ్చిన నివేదికలను దగ్గరపెట్టుకొని ఎమ్మెల్యేలపై పెత్తనం చేసేవారని విమర్శలున్నాయి. ధనుంజయ్‌రెడ్డి వల్ల తాము జగన్‌ను కలవలేకపోతున్నామని, ఆయన వల్లే ఓడిపోయాయని చాలామంది మాజీలు బహిరంగంగా ఆరోపణలు చేశారు. ధనుంజయ్‌రెడ్డి తమకు ,జగన్‌కు మధ్య అడ్డుగోడలు కట్టారని, మాకు జగన్‌కు గ్యాప్‌ పెరిగేలా చేశారని మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం కార్యదర్శి హోదాలో ధనుంజయ్‌రెడ్డిపై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయి. ఏ ఒక్కదానిపైనా జగన్‌ స్పందించలేదు. ధనుంజయ్‌ కూడా దేనికీ బదులివ్వలేదు. పైగా, తనను మీడియా, రాజకీయ పక్షాలు టార్గెట్‌ చేస్తున్నాయని, వాటి చర్యలను ఖండించాలంటూ ఐఏఎస్‌ సంఘంపై ఒత్తిడిచేసేవారు. ఆయన పోరు భరించలేక ఐఏఎస్‌ సంఘం ప్రెస్‌మీట్‌పెట్టి లేని తలనొప్పులు తెచ్చుకుంది. ఇక, ఓ అధికారి భార్య బంగారంతో ఎయిర్‌పోర్టులో దొరికితే ఓ సీనియర్‌ జర్నలిస్టు అంకబాబు సోషల్‌మీడియాలో పోస్టుపెట్టారు. ధనుంజయ్‌రెడ్డి పోలీసులను అంకబాబుపైకి ఉసిగొల్పి తన ప్రతాపాన్ని ప్రదర్శించారు. ముందస్తు నోటీసు, సమాచారం ఇవ్వకుండా ఆ సీనియర్‌ జర్నలిస్టును పోలీసులు అరెస్ట్‌ చేసి తీవ్ర చిత్రహింసలకు గురిచేశారు.


ఎవరీ ధనుంజయ్‌రెడ్డి?

ఉమ్మడి కడప జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన వ్యక్తి ధనుంజయ్‌రెడ్డి. రాయచోటి మండలం చెన్నెముక్కపల్లి సర్పంచిగా 1988లో ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఎంఎస్సీ చదివారు. 1992లో ఢిల్లీ, అండమాన్‌, నికోబార్‌ సివిల్‌ సర్వీసెస్‌ (డాని్‌ష)లో గ్రూప్‌-1 అధికారిగా ఎంపికయ్యారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆయనను డిప్యుటేషన్‌పై ఏపీకి తీసుకొచ్చారు. ఒకే సామాజికవర్గం, సొంత జిల్లా అన్న అభిమానంతో కీలక పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఏపీ సర్వీసులో కలిసిపోయి ఇక్కడి నుంచే 2006లో నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్‌ హోదా పొందారు. ఆ తర్వాత అత్యంత కీలకమైన పోస్టింగ్‌లు దక్కించుకున్నారు. జీహెచ్‌ఎంసీ అదనపు కమిషన ర్‌గా వచ్చాక ఆయన పరపతి, హవా ఒక్కసారిగా పెరిగిపోయాయి. స్నేహాలు, సర్కిల్స్‌ పెరిగాయి. వైఎస్‌ మరణం తర్వాత ఈయనకు పెద్దగా ప్రాధాన్య పోస్టింగులు రాలేదు. రాష్ట్ర విభజన తర్వాత నాటి టీడీపీ ప్రభుత్వమే ఆయనను వ్యవసాయశాఖ కమిషనర్‌గా నియమించింది. 2017లో శ్రీకాకుళం కలెక్టర్‌గా పంపింది. 2019 ఎన్నికల్లో జగన్‌ గెలిచాక అదనపు కార్యదర్శిగా నియామక ఉత్తర్వులు రాకముందే జగన్‌ కోసం సేవలు ప్రారంభించారు. అప్పటి నుంచి 2024 మే 31న రిటైర్‌ అయ్యేవరకు జగన్‌ సేవలో రాటుతేలిపోయారు.

సీఎంకు కార్యదర్శి అంటే ప్రభుత్వ పాలనలో సహకరించే అధికారి. కానీ ధనుంజయ్‌రెడ్డి అంతకన్నా ఎక్కువ. ఇటు వైసీపీలోనూ, అటు ప్రభుత్వంలోనూ అక్టోప్‌సలా విస్తరించారు. ‘సీఎంతో పనిలేదు...ధనుంజయ్‌ ఒప్పుకొంటే చాలు’ అన్నట్టు తన పరపతి పెంచుకున్నారు. ప్రభుత్వ పాలనకంటే, జగన్‌ సొంత పనుల పర్యవేక్షణ, అంతర్గత వ్యవహారాలను చక్కదిద్దడంలో ధనుంజయ్‌రెడ్డి ఆరితేరారు. జగన్‌ కోసం ఆయన చేయని పనులు లేవని సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. ఫలితంగానే వేలకోట్ల రూపాయల లిక్కర్‌ కుంభకోణం కేసులో అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు.

అస్మదీయులు, తన సన్నిహితులు దేశంలోని ఏ సర్వీసులో ఉన్నా వారిని జగన్‌ ఏపీకి తీసుకొచ్చి ఆనాడు కీలక పదవులు కట్టబెట్టారు. వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, ధర్మారెడ్డి తదితరులు అలా వచ్చినవారే. రాష్ట్ర సర్వీసుతో సంబంధం లేకున్నా ఏపీకి వచ్చి కీలక పోస్టుల్లో పనిచేశారు. ఇక.. ఏరికోరి సీఎంవోలోకి తెచ్చుకున్న ధనుంజయ్‌రెడ్డి తొక్కని అడ్డదారి లేదు. ఆయన కోసం జగన్‌ ఏకంగా నిబంధనలకు పాతరేసి ఐఏఎస్‌ హోదా కట్టబెట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vamsi Remand News: వంశీకి రిమాండ్‌లో మరో రిమాండ్

Minister Lokesh: రెన్యూవబుల్ పరిశ్రమ మాత్రమే కాదు.. ఉద్యమం

Liquor Scam Arrests: ఏపీ లిక్కర్‌ స్కాంలో మరిన్ని అరెస్ట్‌లు.. జోరుగా చర్చ

Amaravati: ప్రమాదకరంగా అమరావతి కరకట్ట రోడ్డు

For More AP News and Telugu News

Updated Date - May 17 , 2025 | 08:43 AM