ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Devineni Uma: లిక్కర్ స్కామ్‌లో పెట్టెలే దొరికాయి.. కంటైనర్లు దొరకాల్సి ఉంది

ABN, Publish Date - Jul 31 , 2025 | 10:14 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను చూసి ఎవరూ భయపడడం లేదని.. అసెంబ్లీని చూసి ఆయనే భయపడుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా ఎద్దేవా చేశారు.

TDP Leader Devineni Uma

అమరావతి, జులై 31: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. గురువారం అమరావతిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నిన్ను చూసి ఎవరు భయపడడం లేదు జగన్ రెడ్డి.. శాసనసభను చూసి నువ్వే భయపడుతున్నావంటూ ఎద్దేవా చేశారు. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసింది ఎవరో నీ స్నేహితుల్ని ఎవరిని అడిగినా చెప్తారన్నారు. చంద్రబాబు.. పెద్దిరెడ్డి గురించి జగన్ మాట్లాడిన మాటలు అబద్ధమని ఈ సందర్భంగా ఆయన బయటపెట్టారు.

నాటి సంఘటనలను వివరిస్తూ ఉన్న వీడియోను ఈ సందర్భంగా దేవినేని ఉమా బయట పెట్టారు. లిక్కర్ కుంభకోణంలో పెట్టెలు మాత్రమే దొరికాయి కంటైనర్లు దొరకాల్సి ఉందన్నారు. నువ్వు పెట్టే యాప్‌లో కంటైనర్ల డబ్బులు, బంగారం ఏమయ్యాయో చెప్పమని ప్రజలు మిమ్మల్ని అడుగుతారని పేర్కొన్నారు. వ్యూహకర్తలతో బెంగుళూరు ప్యాలెస్‌లో సమావేశాలు పెట్టి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బ తీసే కుట్రలు చేస్తున్నాడంటూ వైఎస్ జగన్‌పై దేవినేని ఉమా నిప్పులు చెరిగారు.

మహిళలను కించ పరిచిన నీ నాయకుడికి మద్దతిస్తూ నువ్వు ఏం చెప్ప దలుచుకున్నావంటూ వైఎస్ జగన్‌ను సూటిగా ప్రశ్నించారు. గత శాసనసభలో మహిళలను కించ పరుస్తూ మాట్లాడినందుకే 11 సీట్లు ఇచ్చి రాష్ట్ర ప్రజలు చెప్పుతో కొట్టారన్నారు. అయినా జగన్ పరివర్తనలో ఏ మాత్రం మార్పు లేకుండా బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి పదవికి ఆశపడి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీ పంచన చేరితే ఆయన కుమారుడు మిధున్ రెడ్డిని లిక్కర్ స్కామ్‌లో భాగస్వామిని చేశావంటూ ఎద్దేవా చేశారు. నీ లిక్కర్ దోపిడీలో భాగస్వామ్యులైన మిధున్ రెడ్డి, ధనుంజయ రెడ్డి సహా ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించక తప్పదని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

ఉప రాష్ట్రపతి ఎన్నికకు కీలక అప్ డేట్

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 10:14 PM