Share News

Vice Presidential Election 2025:ఉప రాష్ట్రపతి ఎన్నికకు కీలక అప్ డేట్

ABN , Publish Date - Jul 31 , 2025 | 09:36 PM

ఉప రాష్ట్రపతి పదవికి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. జగదీప్ ధన్‌ఖడ్ తన పదవికి ఆకస్మాతుగా రాజీనామా చేశారు. దీంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ పదవిని చేపట్టేదెవరనే ఓ చర్చ అయితే దేశ రాజధాని ఢిల్లీ వేదికగా వాడి వేడి చర్చ జరుగుతోంది.

Vice Presidential Election 2025:ఉప రాష్ట్రపతి ఎన్నికకు కీలక అప్ డేట్
Vice President Election

న్యూఢిల్లీ, జులై 31: జగదీప్ దన్‌ఖడ్ రాజీనామాతో ఉప రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కసరత్తు చేస్తోంది. అందులోభాగంగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్ కాలేజీని ఖరారు చేసినట్లు సీఈసీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం సీఈసీ ట్వీట్ చేసింది. రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారం.. లోక్‌సభ సభ్యులతోపాటు రాజ్యసభకు ఎన్నికైన సభ్యులు ప్లస్ నామినేటెడ్ సభ్యులు ఈ ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులుగా ఉంటారని వివరించింది.


మరోవైపు ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీని.. మరో ఇద్దరు ఉన్నతాధికారులను అదనపు రిటర్నింగ్ అధికారులుగా సీఈసీ నియమించింది. ఉప రాష్ట్రపతి 2025 ఎన్నిక కోసం సంబంధించి ఎలక్టోరల్ కాలేజీని సిద్ధం చేసినట్లు చెప్పింది. ఈ ఎన్నికకు నోటిఫికేషన్ తేదీ వెలువడిన వెంటనే ఈ ఎలక్టోరల్ కాలేజీ జాబితా అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.


మరికొద్ది రోజుల్లో ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుందని విశదీకరించింది. మరోవైపు ఇటీవల ఉప రాష్ట్రపతి పదవికి ఇంకా రెండేళ్ల సమయం ఉన్నా.. జగదీప్ ధన్‌ఖడ్ ఆకస్మాతుగా రాజీనామా చేశారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. అయితే ఆ పదవిని చేపట్టేదెవరనే దానిపై దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఒక చర్చ వాడి వేడిగా సాగుతోంది.


ఇక ఈ పదవి బిహార్ సీఎం, జేడీ (యూ) అధినేత నితీష్ కుమార్ లేదా తమిళనాడు రాష్ట్రానికి చెందిన మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఎంపిక చేసే అవకాశముందని ఓ ప్రచారం సైతం సాగుతోంది. కానీ సీపీ రాధాకృష్ణన్‌కు ఆర్ఎస్ఎస్ బ్యాక్ గ్రౌండ్ ఉంది. దీంతో అతడి వైపే బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కేంద్రంలోని బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

For More National news And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 09:50 PM