ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Narasaraopet Court: డిప్యూటీ సీఎంను దూషించిన కేసులో నిందితునికి రిమాండ్‌

ABN, Publish Date - Jun 09 , 2025 | 05:41 AM

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను దూషించిన కేసులో నిందితుడైన సరసరావుపేట మండలం ములకలూరు గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌కు నరసరావుపేట మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఆవుల సలోమి రిమాండ్‌ విధించారు.

నరసరావుపేట లీగల్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను దూషించిన కేసులో నిందితుడైన సరసరావుపేట మండలం ములకలూరు గ్రామానికి చెందిన ఇర్ఫాన్‌కు నరసరావుపేట మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ న్యాయాధికారి ఆవుల సలోమి రిమాండ్‌ విధించారు. ఈ నెల 4వ తేదీన తెనాలిలోని రౌడీషీటర్లను పరామర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వెళ్లిన సందర్భంగా నిందితుడు సోషల్‌ మీడియాలో పవన్‌ కల్యాణ్‌ను దూషించిన విషయం విదితమే. ఈ మేరకు జనసేన మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ శుక్రవారం రాత్రి నరసరావుపేట రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శనివారం నిందితుడిని అరెస్టు చేసి ఆదివారం న్యాయాధికారి ఎదుట ప్రవేశ పెట్టగా రిమాండ్‌ విధించారు.

Updated Date - Jun 09 , 2025 | 05:49 AM