Dalit Youth Attack: దళిత యువకుడిపై దాష్టీకం
ABN, Publish Date - Jul 22 , 2025 | 06:04 AM
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించాడని ఓ దళిత యువకుడిపై ముగ్గురు యువకులు విచక్షరహితంగా..
ఉద్యోగాలిప్పిస్తానని మోసంచేశాడన్న ఆరోపణతో దాడి
విచక్షణరహితంగా బెల్టు, కొబ్బరి మట్టతో కొడుతున్న వీడియోలు వైరల్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
అమలాపురం, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించాడని ఓ దళిత యువకుడిపై ముగ్గురు యువకులు విచక్షరహితంగా దాడికి పాల్పడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా కేంద్రమైన అమలాపురంలో శనివారంరాత్రి ఘటన జరగ్గా, దాడి దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. దీనిపై ఇప్పటికే అమలాపురం పట్టణ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయినవిల్లి మండలం వెలువలపల్లి మండలానికి చెందిన దళితుడైన దోనిపాటి మహేశ్వరరావు అలియాస్ మహే్‌షను ఈనెల 19వ తేదీన అమలాపురం పట్టణానికి చెందిన యల్లమిల్లి విజయ్, నాయుడు రాజు, కృష్ణ పేరూరు వై.జంక్షన్‌లో ఆటో ఎక్కించుకుని అల్లవరం మండలం దేవర్లంక ప్రాంతానికి తీసుకువెళ్లారు. అక్కడ ఓ షాపు వద్ద మహే్‌షను ఉంచి... కొందరికి ఉద్యోగాలు ఇప్పిస్తానని మధ్యవర్తిగా ఉండి మోసం చేశాడని ఆరోపిస్తూ బెల్టుతోను, కొబ్బరి మట్టతోను కొట్టారు. కాళ్లమీద పడి వేడుకున్నా దాడిచేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై అమలాపురం పట్టణ పోలీసులు ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదుచేశారు. అమలాపురం డీఎస్పీ టీఎ్‌సఆర్కే ప్రసాద్ దర్యాప్తు చేస్తున్నారు. దాడికి పాల్పడ్డవారు జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి అనుచరులుగా ప్రచారం జరుగుతోంది. గాయపడ్డ మహే్‌షను అమలాపురం ఏరియా ఆసుపత్రిలో పలువురు దళిత నాయకులు పరామర్శించారు. కాగా, మహే్‌షపై దాడి జరిగే సమయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసంచేసిన మున్సిపల్ ఉద్యోగి అక్కడే ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 22 , 2025 | 06:04 AM