Minister NMD Farooq: మసాల్చీల దినసరి వేతనం పెంపు
ABN, Publish Date - Jul 17 , 2025 | 04:46 AM
రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పని చేస్తున్న మసాల్చీల దినసరి వేతనాన్ని రూ.300 నుంచి రూ.570కు..
నెలలో 26 రోజులకు వర్తింపు: మంత్రి ఫరూక్
అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పని చేస్తున్న మసాల్చీల దినసరి వేతనాన్ని రూ.300 నుంచి రూ.570కు పెంచినట్లు మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ తెలిపారు. కోర్టుల ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడం, చిన్న చిన్న సహాయక పనులు చేసేవారు(మసాల్చీలుగా) దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న వేతన సమస్యను ప్రభుత్వం పరిష్కరించినట్లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దినసరి వేతనాన్ని పెంచడమే కాకుండా వేతనాన్ని నెలలో 26 రోజుల వరకు వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. మసాల్చీలు ఇక నుంచి నెలకు దాదాపు రూ.14,820 వరకు వేతనం పొందుతారని వెల్లడించారు. ప్రభుత్వ నిర్ణ యంపై మసాల్చీలు హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - Jul 17 , 2025 | 04:46 AM