AP Government: కొబ్బరి, పొగాకు పంటలకూ బీమా
ABN, Publish Date - Jun 06 , 2025 | 06:12 AM
రాష్ట్రంలోని కొబ్బరి, పొగాకు రైతులకు ఈ ఏడాది నుంచి పంటల బీమా వర్తించనున్నది. గతేడాది మామిడిని పంటల బీమాలోకి చేర్చిన రాష్ట్రప్రభుత్వం..కేంద్రం ప్రతిపాదనతో ఇప్పుడు కొబ్బరి, పొగాకును కూడా పంటల బీమా పరిధిలోకి తెచ్చింది.
అమరావతి, జూన్ 5 (ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలోని కొబ్బరి, పొగాకు రైతులకు ఈ ఏడాది నుంచి పంటల బీమా వర్తించనున్నది. గతేడాది మామిడిని పంటల బీమాలోకి చేర్చిన రాష్ట్రప్రభుత్వం..కేంద్రం ప్రతిపాదనతో ఇప్పుడు కొబ్బరి, పొగాకును కూడా పంటల బీమా పరిధిలోకి తెచ్చింది. పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమాలో ఈ పంటలను చేర్చారు. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖతో ఎంపానల్ అయిన రాష్ట్ర వ్యవసాయ శాఖ కొబ్బరి, పొగాకు పంటలకు బీమా అమలుకు టెండర్లు పిలిచింది. శుక్రవారం బిడ్లును ఖరారు చేయనున్నది. ప్రభుత్వ ఆమోదంతో అవార్డు నోటీసు జారీ చేయనున్నది. కొబ్బరి బీమా వర్తింపజేయడానికి 2025 ఖరీ్‌ఫలో ఏడు జిల్లాల్లోని మూడు క్లస్టర్లు, పొగాకు(ఎ్‌ఫసీవీ)కు 2025-26 రబీలో ఆరు జిల్లాల్లోని మూడు క్లస్టర్లను అర్హత ప్రాంతంగా గుర్తించింది. బీమా ప్రయోజనాల కోసం నోటిఫైడ్ ఏరియాల్లోని రైతులు, కౌలు సాగుదారులు వివరాలు నమోదు చేసుకోవాలి. ప్రీమియంలో తన వాటాను రైతు చెల్లిస్తే.. సబ్సిడీ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి.
Updated Date - Jun 06 , 2025 | 06:16 AM