యుద్ధం వద్దే వద్దు: సీపీఐ నారాయణ
ABN, Publish Date - May 05 , 2025 | 05:43 AM
యుద్ధం కాకుండా ఉగ్రవాద నిర్మూలనదే సరైన దారి అని సీపీఐ నారాయణ అన్నారు. రెండు దేశాలు శాంతియుతంగా వ్యవహరించాలన్నారు
తిరుపతి, మే 4 (ఆంధ్రజ్యోతి): ‘పహల్గాం ఉగ్రదాడి అనంతరం పరిణామాలను పరిశీలిస్తే రెండు దేశాలు యుద్ధానికి కాలు దువ్వుతున్నట్లు తెలుస్తోంది. యుద్ధమే వస్తే ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతుంది. పాకిస్థాన్‌పై యుద్ధం కాకుండా ఉగ్రవాదాన్ని అణచివేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ‘లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక’ ఆధ్వర్యంలో తిరుపతిలో ఆదివారం జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో నారాయణ మాట్లాడారు. ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం మన దేశ శక్తి సామర్థ్యాలను కూడగట్టుకొని ముందుకు సాగాలన్నారు. మనది లౌకిక దేశమన్న విషయాన్ని పాలకులు దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. తమ అధికారాన్ని కాపాడుకోవడానికి, మైనారిటీలను బూచిగా చూపి, ఉగ్రవాదం అన్న సాకుతో యుద్ధం ప్రకటించి ప్రజల మన్ననలు పొందాలని కేంద్రంలోని పాలకులు చూస్తున్నారని ఆరోపించారు. పాకిస్థాన్‌లోను, భారత్‌లోనూ ప్రజలు యుద్ధం కోరుకోవడం లేదన్న విషయాన్ని ప్రధాని మోదీ గ్రహించాలన్నారు.
Updated Date - May 05 , 2025 | 05:43 AM