ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

SC ST Bail Jurisdiction: ఎస్సీ ఎస్టీ బెయిల్‌ పిటిషన్ల పరిధిపై విచారణ

ABN, Publish Date - May 07 , 2025 | 06:58 AM

ఎస్సీ, ఎస్టీ చట్టంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ పరిధిని తేల్చే వ్యవహారం మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో పూర్తి వాదనల కోసం విచారణ బుధవారానికి వాయిదా పడింది

అమరావతి, మే 6(ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణపరిధిని తేల్చే వ్యవహారం మంగళవారం ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఓ.మనోహర్‌రెడ్డి, న్యాయవాది ఎంఆర్‌కే చక్రవర్తి వాదనలు వినిపించారు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదైనప్పుడు సంబంధిత సెక్షన్లు నిందితులకు వర్తించవని ప్రాథమికంగా అభిప్రాయనికి వస్తే ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయాన్ని వెల్లడించే అధికారం హైకోర్టుకు ఉందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పులను చదివి వినిపించారు. వ్యాజ్యాలపై పూర్తిస్థాయి వాదనల కోసం విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.సురే్‌షరెడ్డి, జస్టిస్‌ వి.సుజాతతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది.


ఎస్సీ, ఎస్టీ చట్టంలోని నిబంధనల కింద కేసులు నమోదైనప్పుడు ముందస్తు బెయిల్‌ కోసం ముందుగా సంబంధిత ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు సింగిల్‌ జడ్జి గతంలో తీర్పు ఇచ్చారు. అయితే నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చని వైసీపీ నేతలు విడదల రజని, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, మరికొందరు పిటిషనర్లు ఇటీవల హైకోర్టులోని మరో సింగిల్‌ జడ్జి వద్ద వాదనలు వినిపించారు. దీంతో న్యాయమూర్తి... ముందస్తు బెయిల్‌ పిటిషన్లపై విచారణ పరిధిని తేల్చే వ్యవహారాన్ని ధర్మాసనానికి నివేదించారు. దీంతో సీజే ఈ వ్యవహారాన్ని తేల్చే బాధ్యతను జస్టిస్‌ సురేష్‌ రెడ్డి ధర్మాసనానికి అప్పగించారు.

Updated Date - May 07 , 2025 | 06:58 AM