Minister Satya Kumar: కరోనాపై భయాందోళన అక్కర్లేదు
ABN, Publish Date - Jun 13 , 2025 | 04:47 AM
కరోనా కొత్త వేరియంట్లపై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.
వైద్య, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ స్పష్టీకరణ
గుంటూరు, జూన్ 12(ఆంధ్రజ్యోతి): కరోనా కొత్త వేరియంట్లపై ప్రజలు భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలన 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన గురువారం గుంటూరు వచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ చాలా కొత్త వేరియంట్లు కనిపిస్తున్నాయని, అయితే వాటిల్లో ఏవీ ప్రమాదకరంగా లేవన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76 పాజిటివ్ కేసులు మాత్రమే ఉన్నాయని, వారిలో 9 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నామని, మిగతా వాళ్లంతా హోం ఐసోలేషన్‌లోనే ఉన్నారని తెలిపారు. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు అవసరమైన కిట్‌లు, మందులు వంటివన్ని సిద్ధం చేశామన్నారు.
Updated Date - Jun 13 , 2025 | 04:48 AM