AP Cooperative Sector: సహకార సంస్థల్లో అవకతవకలపై విచారణ
ABN, Publish Date - May 06 , 2025 | 05:34 AM
ఆంధ్రప్రదేశ్ సహకార సంస్థల్లో 2019-24 మధ్య జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొణతాల రామకృష్ణను చైర్మన్‌గా పెట్టి ఏడుగురితో ప్రత్యేక సభాసంఘం ఏర్పాటుచేసింది.
కొణతాల చైర్మన్‌గా ఏడుగురితో సభాసంఘం ఏర్పాటు
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్(ఆప్కాబ్), జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్)ల్లో2019-24 మధ్య జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో సహకార సంఘాల్లో జరిగిన అవినీతిని గత అసెంబ్లీ సమావేశాల్లో పలువురు సభ్యులు ప్రస్తావించారు. దీంతో మార్చి 20నఅసెంబ్లీ తీర్మానం మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక హౌస్ కమిటీతో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఏడుగురు సభ్యులతో సభాసంఘాన్ని నియమిస్తూ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ప్రసన్నకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సభాసంఘం చైర్మన్‌గా కొణతాల రామకృష్ణ వ్యవహరించనున్నారు. ఎమ్మెల్యేలు కూన రవికుమార్, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, బొలిశెట్టి శ్రీనివాస్, యార్లగడ్డ వెంకట్రావు, బూర్ల రామాంజనేయులు, ఎన్ అమరనాథ్‌రెడ్డి సభ్యులుగా నియమితులయ్యారు. సభాసంఘం మొదటి సిటింగ్ తేదీ నుంచి ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Updated Date - May 06 , 2025 | 05:35 AM