ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM Chandrababu : మిర్చి రైతులకు ధర లోటు చెల్లించండి

ABN, First Publish Date - 2025-02-20T03:24:52+05:30

ఇంటర్వెన్షన్‌ పథకం(ఎంఐఎస్‌) కింద ధర లోటు చెల్లింపు(పీడీపీ)ని అమలు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు...

  • మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీమ్‌ అమలు చేయండి

  • కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి సీఎం చంద్రబాబు లేఖ

అమరావతి, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): మార్కెట్‌లో ఎర్ర మిరప కొనుగోలు ధర తగ్గినందున ఏపీ మిర్చి రైతులకు మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ పథకం(ఎంఐఎస్‌) కింద ధర లోటు చెల్లింపు(పీడీపీ)ని అమలు చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు... కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాజాగా కేంద్రమంత్రికి సీఎం మరో లేఖ రాశారు. ‘ఏపీలో మిర్చి ఉత్పత్తి నష్టాన్ని 25శాతం నుంచి75శాతానికి వరకు కవరేజ్‌ని పెంచడంతో పాటు 50ః50 నిష్పత్తికి బదులు 100ు నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి. ఈ విషయంలో మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ కమిటీ ద్వారా ఈ నెల 14న ఢిల్లీలో జరిగిన మంత్రుల కమిటీకి ప్రతిపాదనలు పంపడం జరిగింది. గుంటూరు యార్డుకు ఇప్పటికే మిర్చి అధికంగా రావడం ప్రారంభమైంది. ప్రత్యేక రకం మిర్చి క్వింటా రూ.13,600, సాధారణ రకం రూ.11,500 పలుకుతోంది. 2022-23లో సగటు ధర రూ.20,500 వచ్చింది. 2023-24లో సగటు ధర రూ.20వేలు పలికింది. 2024-25లో క్వింటా రూ.13,600 సగటు ధర వస్తోంది. అంటే గత రెండేళ్ల ధరల కంటే ఈ ఏడాది చాలా తక్కువగా ఉంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిని దృష్టిలో పెట్టుకుని, 100% నష్టాన్ని కేంద్రం భరించడంతో పాటు ఏపీలో రైతుల నష్టాన్ని మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ స్కీం ద్వారా తగ్గించవచ్చు’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - 2025-02-20T03:24:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising