ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Srisailam dam: శ్రీశైలం దుస్థితిపై సీఎం సీరియస్‌

ABN, Publish Date - May 13 , 2025 | 04:19 AM

శ్రీశైలం జలాశయంలో నిర్మాణాల దుస్థితిపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. డ్యాం మరమ్మతులకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించి, కేంద్ర జలసంఘం, జాతీయ డ్యాం భద్రతా సంస్థలతో సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

‘ఆర్థిక శాఖతోనే అసలు పేచీ’పై ఆరా

సిలిండర్లు దెబ్బతిన్న సంగతి ఇన్నేళ్లూ ఎందుకు చెప్పలేదు?

తక్షణమే ఎన్‌డీఎ్‌సఏ, జలసంఘంతో సమావేశం నిర్వహించాలి

మరమ్మతులకు ఎంతవుతుందో వాటి ద్వారా అంచనా వేయించాలి

ఆ మొత్తానికి వెంటనే కేబినెట్‌ ఆమోదం తీసుకోవాలి

సీఎంవో కార్యదర్శికి ఆదేశం

అమరావతి, మే 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలో కొన్ని నిర్మాణాల వద్ద నెలకొన్న దుస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా పరిగణించారు. స్పిల్‌వే.. అప్రోచ్‌ చానల్‌ వద్ద ఏర్పాటు చేసిన సిలిండర్లు పూర్తిగా ధ్వంసం కావడం.. టెయిల్‌పాండ్‌ వద్ద కట్టిన ఆనకట్ట కూడా కొట్టుకుపోయినా పునర్నిర్మాణ చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆర్థిక శాఖతోనే అసలు పేచీ’ శీర్షికన సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ప్లంజ్‌పూల్‌ వద్ద భారీ గొయ్యి ఏర్పడిందన్న విషయం తప్ప.. స్టీల్‌ సిలెండర్లకు రంధ్రాలు పడడం.. కొండ భాగం కోత వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి ఇంతవరకు ఎందుకు తీసుకురాలేదని మండిపడ్డారు. తక్షణమే కేంద్ర జలసంఘం, జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ)తో సమావేశం ఏర్పాటు చేయాలని.. మొత్తం మరమ్మతులకు ఎంతవుతుందో అంచనాలు తయారుచేయించాలని సీఎంవో కార్యదర్శి రాజమౌళిని ఆదేశించారు. ఆ అంచనాలను మంత్రివర్గం ముందుంచి వెంటనే ఆమోదం తీసుకోవాలని స్పష్టంచేశారు. దరిమిలా రాజమౌళి సోమవారం మూడుసార్లు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌తో మాట్లాడారు. సీఎం ఆదేశాలను తెలియజేశారు. ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయకపోవడం ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చింది. కేంద్రప్రభుత్వ డివిడెండ్‌రీఇన్వె్‌స్టమెంట్‌ ప్లాన్‌ (డ్రిప్‌) నిధులు కూడా మంజూరు కావడం లేదని.. డ్యాముల నిర్వహణకు నిధులు కోరుతున్నా ఇవ్వడం లేదని సాయిప్రసాద్‌ వివరించారు. ఈ సందర్భంగా ఈ నెల ఐదో తేదీన ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ అనిల్‌ జైన్‌ రాసిన లేఖ ప్రతిని సీఎంవోకు పంపించారు.


ఎన్‌డీఎ్‌సఏ నివేదిక, తక్షణ చర్యలపై ప్రాథమిక నివేదిక అందించారు. ప్లంజ్‌పూల్‌ వద్ద ఏర్పడిన భారీ గొయ్యి ప్రభావాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయన తెలిపారు. సముద్రతీర ప్రాంతంలో హార్బర్‌ వద్ద ఆటుపోట్లను తట్టుకుని.. సముద్రపు నీరు సమీప ప్రాంతాలను ముంచెత్తకుండా నివారించేందుకు భారీ సిమెంట్‌ దిమ్మెలు వేస్తారని.. అదే మెథడాలజీని ప్లంజ్‌పూల్‌ వద్ద కూడా వాడాలని నిర్ణయించామని చెప్పారు. కాగా.. సాయిప్రసాద్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. దాని కథనంలో ప్రచురితమైన ఫొటోలు చూశాక.. జలాశయానికి పొంచి ఉన్న ప్రమాద తీవ్రత ఏస్థాయిలో ఉందో అర్థమైందని అన్నారు. ఎన్‌డీఎ్‌సఏ, జలసంఘంతో సమావేశమై.. ఆయా మరమ్మతు పనులకు ఎంతవుతుందో అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని.. ఈ వ్యవహారంలో సీఎంవో ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని స్పష్టంచేశారు. ఇంకోవైపు.. శ్రీశైలం జలాశయం దుస్థితిని సీఎం సీరియ్‌సగా తీసుకోవడంతో యుద్ధప్రాతిపదికన టెయిల్‌పాండ్‌ డ్యాం పునరుద్ధరణ, జలాశయాన్ని ఆనుకుని ఉన్న కొండ కోతకు గురికాకుండా చూడడం.. 2009లో కొట్టుకుపోయిన టెయిల్‌పాండ్‌ రహదారి పునర్నిర్మాణంపై జలవనరుల శాఖ దృష్టి సారించింది. అంచనాలు తయారై వచ్చాక సదరు మరమ్మతు పనులను ప్రస్తుతం శ్రీశైలం జలాశయం వద్ద నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థకు అప్పగించాలని యోచిస్తోంది.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 04:19 AM