Tech AI 2.0: టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందే.. సీఎం చంద్రబాబు
ABN, Publish Date - May 14 , 2025 | 02:41 PM
టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో జరుగుతున్న పశుసంవర్థక శాఖ టెక్ ఏఐ 2.0ను ఇవాళ సీఎం ..
CM Chandrababu Naidu : టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడలో జరుగుతున్న పశుసంవర్థక శాఖ టెక్ ఏఐ 2.0ను ఇవాళ సీఎం చంద్రబాబు ప్రారంభించి ప్రసంగించారు. గతంలో ఎంట్రప్రెన్యూర్ లను ప్రోత్సహించుకోవడానికి జి ఎఫ్ ఎస్ టి లాంటి సంస్థను తెచ్చామని గుర్తు చేశారు. లైవ్ స్టాక్ పై 42 లక్షలు మంది ఆధారపడ్డారని చెప్పిన చంద్రబాబు, 13.5 శాతం GST కాంట్రిబ్యూషన్ live స్టాక్ ద్వారా వస్తోందని వివరించారు.
మిల్క్ డైరీల నుండి ఫార్మర్స్‌కు రెగ్యులర్‌గా ఆదాయం వస్తోందని.., తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రతిసారీ రైతు ఆదాయం డబుల్ అవుతుందని చంద్రబాబు చెప్పారు. డైరీ పరిశ్రమలో కూడా పురోగతి వుంటోందని, లక్ష 69 వేల కోట్లు లైవ్ స్టాక్‌లో GSDP కాంట్రిబ్యూషన్ ఉందని తెలిపారు. "దీని తరువాత హార్టీకల్చర్లో అత్యధిక ఆదాయం వస్తోంది. దేశంలో వ్యవసాయ రంగంలో ఫాస్ట్ గ్రోయింగ్ ఏపీనే. ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా ఎప్పటి నుండో చెపుతారు. తెలంగాణకు 67 శాతం సర్వీస్ సెక్టార్, వ్యవసాయం 14 శాతం ఉంది. ఏపీలో అగ్రికల్చర్ ఎక్కువ.. సర్వీస్ సెక్టార్ తక్కువ. సర్వీస్ సెక్టార్ ఆదాయం రాష్ట్రంలో తగ్గిపోయింది. రాష్ట్రంలో ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతున్నాయి. నేను ఉదయం బ్రేక్ఫాస్ట్‌గా అమ్లెట్ మాత్రమే తింటాను. మిల్లెట్‌లు, ఫ్రూట్‌లకు ప్రాధాన్యం పెరుగుతుంది. దేశంలో మైక్రో ఇరిగేషన్ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏపీ" అని చంద్రబాబు చెప్పారు.
ఇంకా తన ప్రసంగంలో సీఎం చంద్రబాబు ఏం చెప్పారంటే.."ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీతో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. వచ్చే 3 నుండి 4 నెలల్లో 100 శాతం వాట్సప్ గవర్నెన్స్ కల్పిస్తాం. రాబోయే రోజుల్లో GFST లాంటి సంస్థలు మరిన్ని ఏర్పాటు చేయాలి. వ్యవసాయ కూలీలు, రైతు కుటుంబంలో పిల్లలు IT చేయాలని గతంలో పిలుపు నిచ్చాం. ఇప్పుడు కొత్త నినాదంతో ముందుకు వస్తున్నాం..అదే.. ప్రతి ఇంటికి.. ఒక సంస్థకు యజమాని (ఎంట్రప్రెన్యువర్) తయారు కావాలి. గోదార్‌కు పైలెట్ ప్రాజెక్ట్ గా చిత్తూరు జిల్లా. IT కంపెనీల్లో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా పని చేసే వాళ్లు ఇప్పుడు వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. డైరీ షెడ్స్‌కు పల్లెలో అయినా పట్టణాల్లో అయినా ప్రాపర్టీ టాక్స్ రద్దు." వంటి సంచలన విషయాల్ని చంద్రబాబు తన ప్రసంగంలో వెల్లడించారు.
Updated Date - May 14 , 2025 | 03:52 PM